లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్

ఉప్పల్ నియోజక వర్గం మీర్పేట్ డివిజన్ మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీ లో విద్యార్ధులనుద్దేశించి లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాట్లాడిన మాటలు:
· దేశంలో యువత సంఖ్య పెరుగుతుండడం వల్ల సంప్రదాయ పార్టీలు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో యువత ప్రాధాన్యతను గుర్తిస్తున్నాయి.
· కొత్త రాజకీయం తేగల గొప్ప అవకాశం 2009లో యువత ముందు ఉంది.
· యువత నూరుశాతం ఓటువేసి కొత్త రాజకీయం తేవాలి.
· అభివృద్ధికి కీలకమైన మంచి రాజకీయాన్ని ఎన్నుకునే దిశగా ఓటుహక్కును వినియోగించడమే అసలైన దేశభక్తి.


