నాకు అర్దం కానీ విషయం:
తెలుగుదేశం వారు ప్రజారాజ్యం ను ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చెయ్యడం. వాళ్ళు ఆ విధంగా ఎలా చెయ్యగల్గుతున్నారో అర్దం కావడం లేదు. వారికి వారు ప్రశ్నించుకోవలసిన ప్రశ్న.
తెలుగుదేశం ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీనా ?
దానికి జవాబు అవును అయితే, తెలుగుదేశం వారికి ప్రశ్నించే అర్హత లేదు.
జవాబు కాదు అయితే మీ నోటివెంట ప్రజారాజ్యంను ఆ కోణంలో విమర్శించరు.

నా అభిప్రాయం:
ఏ పార్టీ కూడా ఏ సామాజిక వర్గానికి చెందింది కాదు. కేవలం ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ గెలిచేయదు. చంద్రబాబు, NTR లు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కాదా ? ఎందుకు చంద్రబాబు, NTR ను వెన్నుపోటు పోడవలసి వచ్చిందో ఆలోచించండి.

NTR సామాజిక వర్గానికి చెందిన కృష్ణనే ఎందుకు NTR మీద వ్యతిరేకంగా ఘోరమైన సినిమాలు తీసాడు ?

“మూడు పార్టీలు, మూడు కుటుంబాలు, మూడు కులాలు. ఇదేనా రాజకీయం? రాష్ట్ర ఓటరులారా ఆలోచించండి.” అంటూ ఆవేదన చెందుతున్నాము. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మూలం ఏమిటి అన్నది ఆలోచిస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతాది.

ఆదిపత్యం ఎవరి సొంతం కాదు. ఒకటి రెండు అయినట్టే, ఈ రోజు రెండు మూడు అయినందుకు సంతోషించాలి. రేపు మూడు నాలుగు .. అందరికీ రాజ్యాధికారం రావాలి.

చిరంజీవి రాక వలన కులాలపై చర్చలు, ఎవరిది ఏ కులం అనీ భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు. నేను ఇది చాలా మంచింది అనే ఫీల్ అవుతున్నాను. అందరకీ న్యాయం జరగాలి.  ఆనాడు NTR కు అధికారం వచ్చిన తరువాత జరిగితే, ఈనాడు చిరంజీవి అధికారం రాకముందే జరగడం హర్షనీయం. అందరికీ అవగాహన అవసరం.

bottomline:
నాయకుల సంపద కాదు. ప్రజల సంపద పెరగాలి.