ప్రత్యేక తెలంగాణ అనేది ఒక పెద్ద రాజకీయం అన్న నిజం నేను లేటుగా తెలిసుకున్నాను. రాజకీయ మనుగడే తప్ప ఎవ్వరికి ప్రత్యేక తెలంగాణ పై చిత్తశుద్ది లేదు. నేను ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణకు పూర్తి వ్యతిరేకిని. తెలుగు వాళ్ళంతా కలిసి వుండాలి అనుకునే వాడిని. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలు , హైదారాబాద్ లో జన సముద్రం , దానికి తొడు హైదారాబాద్ కు వస్తున్న ప్రజల వలసలు చూస్తుంటే కచ్చితంగా రాష్ట్రాని రెండు/మూడు ముక్కలు చెయ్యడం బెటర్ అనిపిస్తుంది. 1) హైదారాబాద్ లో రద్దీ తగ్గించ వచ్చు. 2) వేరే సిటీలు అభివృద్ధి చూడవచ్చు. 3) ప్రాంత(సెంట్ మెంట్) రాజకీయాలకు స్వస్తి పలకవచ్చు.
ప్రత్యేక తెలంగాణపై ఒక్క ప్రజారాజ్యంకే చిత్తశుద్ధి , స్పష్టత వున్నాయనిపిస్తుంది.
ప్రత్యేక “సామాజిక తెలంగాణ” ఒక్క ప్రజారాజ్యం వలనే సాధ్యం: సామాజిక తెలంగాణపై వారు ఇచ్చిన హామీలు;
1) అసెంబ్లీ లో బిల్లు ప్రవేశం
2) కేంద్రం ప్రతిపాదిస్తే వెంటనే అంగీకారం .. లేదంటే కేంద్రంపై ఒత్తిడి ..



satya
మార్చి 31, 2009 @ 20:44:51
మీకు ఒక్క విషయం చెప్పదలచుకున్నా.. ఇది మీ జేపీ మీద విమర్శలకు సమాధానం. చిరంజీవి ఇంతవరకు అధికారం లోకి రాలేదు కాబట్టి దాన్ని విమర్శించకూడదు అనేది హాస్యాస్పదం. రాజకీయాల గురించి ఓనమాలు తెలియవనుకోవాలి.. ఏ పార్టీ ని అయినా విమర్శించటానికి Qualifying mark అది అధికారం లో ఉందా లేదా అనేది కాదు.. వివిధ సామాజిక అంశాలపై దానికున్న స్పష్టత..మరియు దాని విధివిధానాలు.. స్పష్టత అనేది buzz word కాదు, ప్రతీసారి ఏంటో చెప్పకుండా స్పష్టత, మార్పు అని ఊదరగొట్టటానికి. ఏ రకంగా చూసినా పీఆర్పీ కన్నా లోక్సత్తా విధానాలు చాలా మెరుగు. చిరంజీవి కన్నా జేపీ కి ఉన్న అవగాహన పోల్చదగినది కూడా కాదు.
సరే.. ఒకవేళ పీఅర్పీ రేపు అధికారం లేకపోతే అప్పుడు కూడా విమర్శించకూడదంటారా? అంటే ప్రజలే తిరస్కరించినా కూడా? అలా కానట్లైతే పీఆర్పీ కి ఈసరికే శాసన మండలి లో ప్రాతినిధ్యం ఉంది, అంతే కాదు, నోట్లు పంచి గెలిచిన తర్వాత మా వాడే అని చెప్పుకున్న జెడ్పీటీసీ స్థానం కూడా పీఆర్పీ కి ఉన్నాయి..
a2zdreams
మార్చి 31, 2009 @ 21:00:58
You are right satya. T.V shows కి జేపీ అవగాహన బాగా ఉపయోగ పడతాది.
1. ప్రస్తుత పరిస్థుతులలో Reality and Practicality ఆలోచించండి.
2. ప్రజారాజ్యంపై విమర్శలు చేయవచ్చు. కానీ ఈ మేధావి అతి తెలివితో కాంగ్రెస్ , తెలుగుదేశం లతో కలిపేసి చేస్తున్నాడు . which is wrong at this point.
3. చిత్తశుద్ది , నిజాయితీ లేని అవగాహన ఎవరి కోసం ?
4. ఇప్పుడే కదా చిరంజీవి తన full time జీవితాన్ని ప్రజల కోసం spend చేస్తుంది. తొందర దేనికి సార్ . కచ్చితంగా అన్ని సమస్యలపై అవగాహానే కాదు పరిష్కారం కుడా చూపిస్తాడు
a2zdreams
మార్చి 31, 2009 @ 21:07:17
satya@స్పష్టత అనేది buzz word కాదు, ప్రతీసారి ఏంటో చెప్పకుండా స్పష్టత, మార్పు అని ఊదరగొట్టటానికి.
దాని మీద పూర్తి అధ్యయనం జరగకుండా , అది అలా చేస్తాం , ఇది ఇలా చేసేస్తాం చెప్పాలా? it is in the process.
ప్రజారాజ్యం ఇప్పుడే మొదలయ్యింది. వెయిట్ చెయ్యండి సార్. అధికారం రానివ్వండి.
krishna rao jallipalli
మార్చి 31, 2009 @ 23:21:57
ప్రత్యెక తెలంగాణా వచ్చినా తెలంగాణా వారికి ఒరిగేది ఏమి లేదు. బాగుపడేది అంతకన్నా లేదు. ఇక వృద్ది చెందేది, బాగుపడేది ఎవరయ్యా అంటే… నాయకులు, వారి కుటుంబ సభ్యులు (ముఖ్యమ్గా బామ్మర్దులు), వారి ఉంపుడుగత్తెలు, వారి చెంచా గాళ్ళు మాత్రమె.
satya
మార్చి 31, 2009 @ 23:32:12
T.V shows లో మాట్లాడేది ప్రజలతోనే కానీ గోడలు, కుర్చీలతో కాదు.. తెలిసి అన్నారో తెలియ అన్నారో గానీ కరెక్ట్ మాట అన్నారు.. T.V shows కి జేపీ అవగాహన బాగా ఉపయోగపడుతుందని..అదే వేలం వెర్రి గా వచ్చే సభల్లో మనం వాగింది వినే వాళ్ళే తప్పితే ఎదురు అడిగేవాడు ఎవరూ ఉండరు కాబట్టి అవగాహన అవసరం లేదంటారు…..చిరు కి అవగాహన లేదని ఒప్పుకున్నారు..
Reality and Practicality means డబ్బులు పెట్టి ఓట్లు కొనటమా?
డబ్బులు పెట్టి జనాన్ని తరలించి విధానాలని కాక సభలకి వచ్చే ‘మంది’ ని చూపి తమ గొప్ప చాటాలనుకునే పార్టీ లని ఆయన ఒకే గాటన కడతారు.. అందులో రెండో అభిప్రాయం లేదు.. కుటుంబ వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయ పార్టీలని విమర్శించటం లో ఆయనకు భేదాభిప్రాయాలు లేవు.. చిరు కి మినహాయింపు లేదు..
>>> చిత్తశుద్ది , నిజాయితీ లేని అవగాహన ఎవరి కోసం ?
జేపీ కన్నా చిరు కి చిత్తశుద్ది ఎక్కువా? LOL
సినీగ్లామర్ చిరు కన్నా జేపీ కి ఎక్కువ అంటే ఎంత వెటకారం గా ఉంటుంది…అలానే ఉంది మీ వ్యాఖ్య
>>> దాని మీద పూర్తి అధ్యయనం జరగకుండా , అది అలా చేస్తాం , ఇది ఇలా చేసేస్తాం చెప్పాలా? it is in the process.
Process లో ఇప్పటి వరకు తెలుసుకున్నది ఏంటీ?
చిరు కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఈ నాటిది కాదు, కనీసం 5 నించి 10 సంవత్సరాలనించి ఉన్నది.. పోనీ సంశయాలు వీడి పార్టీ స్థాపించాలన్న ఆలోచన కనీసం 2 సంవత్సరాల నాటిది.. మరి ఈ మధ్య కాలం లో ఏం అధ్యయనం వెలగబెట్టినట్లు?
మీ మరు వ్యాఖ్య లో కూడా అధికార జపమే చేసారు.. అందుకే అన్నారు.. ఇసుక నుండి తైలం తియ్యచ్చు గానీ… అని
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:08:59
satya@అందుకే అన్నారు.. ఇసుక నుండి తైలం తియ్యచ్చు గానీ… అని
———————————————————————————–
నా దృష్టిలో ఈ వ్యాఖ్యను చేతకానితనం అంటారు. very cheap trick.
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:11:47
satya@చిరు కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఈ నాటిది కాదు, కనీసం 5 నించి 10 సంవత్సరాలనించి ఉన్నది.. పోనీ సంశయాలు వీడి పార్టీ స్థాపించాలన్న ఆలోచన కనీసం 2 సంవత్సరాల నాటిది.. మరి ఈ మధ్య కాలం లో ఏం అధ్యయనం వెలగబెట్టినట్లు?
—————————————————–
దిగితే కాని లోటు తెలియదు. వెయిట్ చెయ్యండి సార్ .. he is less than 1 year old in real politics. soon he is going to change the definition of politics.
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:14:49
>>> చిత్తశుద్ది , నిజాయితీ లేని అవగాహన ఎవరి కోసం ?
జేపీ కన్నా చిరు కి చిత్తశుద్ది ఎక్కువా? LOL
సినీగ్లామర్ చిరు కన్నా జేపీ కి ఎక్కువ అంటే ఎంత వెటకారం గా ఉంటుంది…అలానే ఉంది మీ వ్యాఖ్య
——————————————————
మీ నమ్మకం మీది. నా నమ్మకం నాది. జయప్రకాశ్ పెద్ద ముసుగు దొంగ. ఒక్కొకటి బయట పెడుతున్నాడు.
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:20:51
satya@కుటుంబ వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయ పార్టీలని విమర్శించటం
————————————————-
this will change soon. “రాజకీయలంటే దోచుకోవడం” అనే అభిప్రాయం ప్రజలలో వుండటం వలన thats sounds logic. if you think reality, అది చాలా తప్పుడు statement.
రాజకీయాలలో అవినీతిని కడిగి, నిజాయితీని చేర్చగల్గాలి.
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:23:07
satya@మీ మరు వ్యాఖ్య లో కూడా అధికార జపమే చేసారు..
————————————————–
అధికార జపం కాదు అది. HOPE
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:39:11
satya@Reality and Practicality means డబ్బులు పెట్టి ఓట్లు కొనటమా?
——————————————————
కాదు ..
అది నిజం అయితే మీ లెక్క ప్రకారం కాంగ్రెస్ విజయ డంఖా మ్రోగించాలి.
Reality అంటే ఖర్చు పెట్టగలిగే వాడిని ఎదుర్కోవడం. దానికి చాలా మార్గాలు వున్నాయి. లోక్ సత్తా మార్గంలో ఇప్పుడు(2009) సాధ్యం కాదు.
ఇప్పుడు(2009) ప్రజారాజ్యం కు మెండుగా వున్నాయి.
1) అధినాయకుడు చిరంజీవి
2) ధైర్యం గా నిలబడ గల లోకల్ నాయకులు
మీలాంటి మేధావులు నటిస్తారో తెలియదు, చిరంజీవి అంటే ఏడుపో తెలియదు.
a2zdreams
ఏప్రి 01, 2009 @ 00:47:08
satya@T.V shows లో మాట్లాడేది ప్రజలతోనే కానీ గోడలు, కుర్చీలతో కాదు.. తెలిసి అన్నారో తెలియ అన్నారో గానీ కరెక్ట్ మాట అన్నారు.. T.V shows కి జేపీ అవగాహన బాగా ఉపయోగపడుతుందని..అదే వేలం వెర్రి గా వచ్చే సభల్లో మనం వాగింది వినే వాళ్ళే తప్పితే ఎదురు అడిగేవాడు ఎవరూ ఉండరు కాబట్టి అవగాహన అవసరం లేదంటారు…..చిరు కి అవగాహన లేదని ఒప్పుకున్నారు..
————————————————–
చిరంజీవికి అవగాహన లేకపోవడం ఏమిటి ?
వెయిట్ చెయ్యండి సార్.
suresh
ఏప్రి 01, 2009 @ 16:43:15
chiru will won the race
JP gurinchi discussion waste
chiru party pettadani vaadi kullu..
chiranjeei zindabad
powerstar zindabad
jai PRP
jai INDIA