prayanam
కొత్తదనం కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా వుంటారు. అది మన తెలుగుసినిమాలలో అయితే ఇంకా తక్కువ.

సేఫ్ తెలుగు సినిమా ఫార్మెట్ లో వెళుతూ, ప్రేక్షకుల ఎమోషన్స్ మరియు ప్రస్థుత ట్రెండ్ అనుగుణంగా వెళుతూ, ఒక తరహా దర్శకులు సక్సస్ సాధిస్తున్నారు. వీరికి పెద్ద ఇమేజ్ వున్న హిరోలు తొడయితే, జాక్‌పట్ కొట్టినట్టే.

సేఫ్ తెలుగు సినిమా ఫార్మెట్ లో కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం చూపిద్దాం, అందరికీ నచ్చకపొయినా కొందరయినా ఆదరించేవాళ్ళు వుంటారనే ధైర్యంతో ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ అని అందరూ ఒప్పుకోవలసిన సత్యం.

ఫ్రెండ్స్ టాక్ ప్రకారం, ఏలేటి మీద నమ్మకమున్న వాళ్ళకు సినిమా 300% satisfied. జస్ట్ 5 క్యారెక్టర్స్ మరియు లిమిటెడ్ లోకేషన్స్ తో దర్శకుడు తన ప్రతిభను పూర్తిగా చూపించాడంటున్నారు. స్టోరీ సింపులే కానీ, రెండు గంటలు అసలు బోర్ కొట్టకుండా తియ్యడం సూపర్ అంటున్నారు. కామెడీ సీన్స్ తో కాకుండా, 80% డైలాగ్స్ తో కామెడీని పండించడం దర్శకుడు గొప్పతనం అంటున్నారు. కానీ ఆ సెటైర్ డైలాగ్స్ అర్దం అవ్వాలంట. "ఐతే" సినిమాలో నటించిన ఒక కుర్రాడు బాగా చేసాడు అంట. ఒవరాల్ గా తెలుగుసినిమా కు దొరికిన ఒక వరం ఏలేటి చంద్రశేఖర్ అంటున్నారు.