chara-pawan

నేను పవన్ కళ్యాన్ ను బాగా ఇష్టపడటానికి గల కారణాలలో ఒకటి ఏమిటంటే “just doing his own business”. తన పనేదో తానూ చేసుకోవడం. మూడో వ్యక్తి గురుంచి పొరబాటున కూడా చెడుగా మాట్లాడక పోవడం. మొదట్లో ఫ్యాన్స్ ను అసలు ఎంకరేజ్ చేసేవాడు కాదు అంట. ఎవరైనా వస్తే అసలు కలిసే వాడే కాదు అంట. కలిసినా ఫ్యానిజం సినిమాలు చూడటానికే పరిమితం కావాలి కానీ విలువైన సమయాన్ని వృధా చేసుకునే విధంగా వుండకూడదు అని క్లాసు తీసుకునేవాడు అంట. అందుకనే తన సినిమా విజయోత్సవాలను అసలు చేసుకోడు, పాల్గొనడు.

1) సినిమా పబ్లిసిటికీ ఫంక్షన్స్ ఎంతో అవసరం. ఓపినింగ్స్ కోసం హైప్ అవసరం.
2) ప్రస్తుత సినిమా విజయోత్సవాలు వలన నిర్మాణంలో వున్న సినిమాలకు మంచి హైప్ వస్తుంది.
3) అన్నిటికి మించి ఫ్యాన్స్ కు పెద్ద పండగ.

గుడుంబా శంకర్ సినిమా నుంచి కారణం ఏమిటో తెలియదు కానీ పవన్ కళ్యాన్ ఎందుకో ఫ్యాన్స్ తో బాగానే కలుస్తున్నాడు. ఫ్యాన్స్ కోసం తనకు ఇష్టం లేని ఫంక్షన్స్ కు కూడా వస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా తన సినిమా జల్సా కు ఆడియో ఫంక్షన్ కు కూడా ఒప్పుకున్నాడు.

మొన్న మగధీర ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాన్ రావడానికి రెండు కారణాలు కనిపించాయి.
1) చరణ్ సినిమా
2) అల్లు అరవింద్ సినిమా

ఫంక్షన్ లో పవన్ కళ్యాన్ స్పీచ్ నాకు భలే నవ్వు తెప్పించింది.

చరణ్ గురుంచి చెప్పడం వరకు బాగానే వుంది. రాజమౌళి ని పొగడటం కూడా బాగానే వుంది. కానీ

మగధీర తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలి అని చెపుతున్నప్పుడు మాత్రం పిచ్చ నవ్వు వచ్చింది. రికార్డుల కోసం సినిమా కాదు, సినిమా బాగుంటే రికార్డులు రివార్డులు వాటంతట అవే వస్తాయి అనుకునే వ్యక్తి ఇలా మాట్లాడుతున్నడేమిటి అనే డౌట్ వచ్చింది.

తను కోరుకునేది:
మంచి సినిమా ద్వారా జనాల ప్రశంసలు పొందడం. (చెప్పటం కన్నా చేసి చూపిద్దాం అని ఎక్కువ మాట్లాడడు)

ఫ్యాన్స్ కోరుకునేది:
ప్రత్యర్దుల హీరోల రికార్డులన్ని బద్దలు కొట్టడం. కొట్టక పోయినా కొట్టేస్తాం అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం.(అలా మాట్లాడితే ఆ క్షణం లో నైనా రికార్డులన్ని బద్దలు కొట్టిసినంత ఆనందం కలుగుతుంది).

ఫ్యాన్స్ కోరుకునే విధంగా మాట్లాడుతున్నట్టు పవన్ కళ్యాణ్ హావభావాలలో క్లియర్ గా కనిపించిది.

పవన్ కళ్యాణ్ కు తనకు నచ్చిన విధంగా వుండాలో, ఫ్యాన్స్ కు నచ్చిన విధంగా వుండాలో తెలియటం లేదు పాపం.