ఆంజనేయులు:
కిక్ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమా సక్సస్ లో సురేందర్ రెడ్డి దే పాత్ర ఎక్కువ అయినా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోస్ డామినేషన్ కాబట్టి రవితేజ కు బాగా పేరు వచ్చింది. పేరు రావడం అంటే తర్వాత సినిమా బాగా క్రేజ్ రావడం. ఆ విధంగా జనాల్లో ఆంజనేయులుపై మంచి అంచనాలే వున్నాయి. నేను ఎదురు చూడటానికి గల ప్రత్యేక కారణం ఆంజనేయులు నిర్మాత గణేష్(పవన్ కళ్యాన్ నెక్స్ట్ సినిమా నిర్మాత) . ఆంజనేయులు ఆడియో సూపర్ కాదు కాని పాటలు బాగానే వున్నాయి అనిపించింది.రవితేజ ఎనర్జీ ఆయన వయసును బయటకు కనిపించనివ్వదు, కాని కిక్ లో రవితేజ అక్కడక్కడా ముసలితనం కనిపించింది. తెలుగుసినిమా యువ హీరోలతో కళ కళలాడుతుంది.ఆ పోటిలో రవితేజ ఎంతవరకు నిలబడగలడో చూడాలి.

జోష్:
నాగ చైతన్య ను చూస్తుంటే, నాకైతే యువ నాగార్జునను చూస్తున్నట్టే వుంది.వాయిస్ కూడా చాలా ఫోర్సింగ్ గా ఫుల్ ఎనర్జీతో వుంది. దిల్ రాజు “సినిమా బాగా వచ్చింది, షూర్ షాట్ హిట్” అంటున్నాడు. పాటలు చాలా బాగున్నాయి. ఐ మీన్ నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా కూడా అంచనాలను రీచ్ అయితే వయసు మళ్ళిన హీరోలను యువకులుగా చూడవలసిన(భరించవలసిన) అవసరం తప్పుతుంది.