వ్రాసినది: a2zdreams | జులై 4, 2009

చరణ్, చిరంజీవి అనవాయితీని కొనసాగించగలడా?

magadheera_team

ట్రైలర్స్, పోస్టర్స్ చూసాక,

ఈ ఏడాది భారీ అంచనాలను రేకెత్తిస్తున్నచిత్రాల్లో రామ్ చరణ్ ‘మగధీర’ ముందుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక విజయం ఎప్పుడూ ఉమ్మడిదే. టీం వర్క్, ఆ టీంకు స్ట్రాంగ్ కెప్టెన్ వుంటేనే అనుకున్నవిజయం సాధించగలం. మగధీర కెప్టెన్ రాజమౌళి తో పాటు ముఖ్యంగా చెప్పుకోవలసిన వాళ్ళు మరో ముగ్గురున్నారు.

  1. మగధీర సినిమా హిరో:  చరణ్ 
  2. కెప్టెన్ కు కావలసినవి ధైర్యంగా సమకూర్చుతుంది: అల్లు అరవింద్ 
  3. రాజమౌళి టేకింగ్ కు ప్రాణం పోస్తుంది: కీరవాణి 
  4.  

ఆడియో ఫంక్షన్ లో అందరూ చరణ్ చిరంజీవిని మించిపొయాడు అంటున్నారు(చరణ్ ఒప్పుకొలేదు అనుకొండి). చిరంజీవి సినిమా హిట్ అయితే అందరికి కంటే ఎక్కువ పేరు చిరంజీవే కొట్టేస్తాడు. అదే అనవాయితీని చరణ్ కొనసాగించగలడా అనేది చరణ్ కు పెద్ద ఛాలెంజ్. నో డౌట్ మగధీర సృష్టికర్త “రాజమౌళి”. ప్లాప్ అనేది లేకుండా మెయింటేన్ చేస్తున్న ఆయన ఇమేజ్ ను మగధీర కూడా నిలబెడుతుందనిపిస్తుంది.

నేను ఎదురుచూస్తుంది మాత్రం: ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎవరికి ఎక్కువ పేరు వస్తుందని ..

పేరు ఎవరుకు వచ్చినా శ్రీహరి చెప్పినట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించే సినిమా ‘మగధీర’ అయితే అందరూ హర్షిస్తారు ..


వర్గములు: