వ్రాసినది: a2zdreams | జులై 4, 2009

మగధీర – సమయానికి తగ్గ అవుట్ పుట్ స్ర్కీన్ మీద చూస్తారు

rajaMouli

మగధీరలో రాజమౌళి ప్రసంగంలో సినిమాపై ఆయనకున్న కానిఫిడెన్స్ బాగా వినిపించింది. ఈ సినిమా సగంలో వున్నప్పుడు చరణ్ కు తనపై బాగా కోపం వచ్చిందని చెప్పారు. దానికి కారణం నేను ఈ సినిమాకు ఎక్కువ సమయం తీసుకొవడం. కానీ ఆ సమయానికి తగ్గ అవుట్ పుట్ స్ర్కీన్ మీద తప్పక కనిపిస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి రాజమౌళి 220 పని దినాలు(షూటింగ్) వెచ్చించారు.

మగధీర గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు:

  • హార్స్ రైడింగ్ వున్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అటువంటి సినిమా ఒకటి తీయ్యాలన్నది నాకొక డ్రీమ్.
  •  

  • చరణ్ డాన్స్, ఫైట్స్ ఎంతవరకూ చెయ్యగలడో పూరీ జగన్నాథ్ చిరుతలో చూపేంచేసాడు.
  •  

  • చరణ్ డాన్స్, ఫైట్స్ మాత్రమే కాకుండా అతనిలో వున్న వేరే సామార్ద్యాన్ని చూపించడానికి మరియు నా డ్రీమ్ నెరవేర్చుకొనే ప్రయత్నమే మగధీరలో హార్స్ రైడింగ్ సీన్స్.
  •  

  • ఇంతవరకు చూడనటువంటి హార్స్ రైడింగ్ సీన్స్ మగధీరలో చూస్తారు. చరణ్ డూప్ అనేది లేకుండా చెయ్యడమే కాదు, చిరంజీవి గారిని మించి చేసాడు.
  •  

  • నేను తీసే సినిమాలకు మా అన్నయ్య కీరవాణి ప్రాణం పొస్తారు. పాటలు, పాటలు కంటే రీరికార్డింగ్.
  •  


వర్గములు: