మొన్నాధ్య ‘కావ్యాస్ డైరీ’ సినిమా ప్రచారంలో భాగంగా మహేష్‌బాబు పత్రికల ముందుకు వచ్చారు. అప్పుడు మాట్లాడుతూ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాను అన్నాడు. ఇప్పుడు అదే బాటలో మొన్న ఆడియో ఫంక్షన్ లో చరణ్ కూడా ఇదే చెప్పాడు. ఈ సంవత్సరం కుదరదు కానీ, వచ్చే సంవత్సరం నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పాడు. ఇలా సభా ముఖంగా చెప్పడం మూలానా, ఆ మాటకు కట్టుబడి వుండటానికి అవకాశం వుందని, అదే విధంగా తన దర్శక నిర్మాతలకు కూడా ఇదే బాటను ఫాలో అవ్వాలని కోరాడు. ప్రస్తుతం చరణ్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. చరణ్ సరసన జెనీలియా కథానాయకగా నటిస్తున్న ఈ చిత్ర్తాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు.
ఇంతకు ముందు రాజమౌళి మాట్లాడుతూ, సినిమా లేట్ అవ్వడానికి తానే కారణం అని, కానీ లేట్ అవుట్ పుట్ స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పారు.
