CLICK HERE FOR MAGADHEERA WISHES TO NAGACHAITANYA:

josh

నిన్న మా టి.వి ఇంటర్వూలో “నేను విమర్శలు వినటానికి రెడీ” అంటున్న నాగచైతన్య చూస్తే ముచ్చటేసింది.

దురదృష్టవశాత్తు ఈ రోజు వస్తున్నటువంటి విమర్శలు ద్వేషంతో కూడుకున్నవే తప్ప నిజాయితీతో కూడుకున్నవి చాలా చాలా తక్కువ.

నిజాయితీతో కూడుకున్న విమర్శలు పదే పదే చెయ్యనవసరం లేదు. ఒక్కసారి చేస్తే చాలు. నిజాయితీతో కూడుకున్న విమర్శలు ముఖ్య వుద్దేశం ‘బెటర్ మెంట్’. వాటిని పట్టించుకోవడం లేదనే బాద పడవలసిన అవసరం లేదు. పట్టించుకోక పోవడం వలన ఎవరికీ నష్టం అనే విషయం వారంతా వారే తెలుసుకుంటారు. మీరు విమర్శకులు అయితే ఎవరి మొప్పు కోసమో కాకుండా మీ అభిప్రాయాన్నినిజాయితీగా తెలియపరచండి. వీరు మన హీరోకు పోటి, వీరి సినిమా మన హిరో సినిమాకు పోటి అని మాత్రం నోటికి వచ్చిన విమర్శలు చేస్తే వాటికి విలువ వుండదు. వీళ్ళ ఫ్యాన్స్ మన సినిమాను తక్కువ చేసారు, మనం ఈ సినిమాను తక్కువ చెయ్యవలసిందే అని అనుకుంటే మనకు వారికి తేడా వుండదు.

ఏదో ఒక కొత్తదనం వుంటే కాని జనాలు థియేటర్ కు రావడం లేదు. దానికి తోడు పైరసీ. ఇటువంటి పరిస్థితులలో ఓపెనింగ్స్ మాత్రమే సినిమాను బ్రతికించగలవు. ఓపెనింగ్స్ రావాలి అంటే ఇమేజ్ కావాలి. వారసత్వం ద్వారా మొదట సినిమాకే పెద్ద హిరో రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్న నాగచైతన్య, చరణ్ కు ధీటుగా నిలబడగల వారసుడిగా మొదటి సినిమా “జోష్” విజయం సాధించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.