కాంగ్రెస్ ఎలా వున్నా నాకు కలిసొచ్చే లాభం కాని, నష్టం కాని లేవు.కాని ఇప్పుడు జరుగుతున్న నాటకాలన్నీ చూస్తూ వుండబట్టలేక:
కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు పత్రికలకు , పాఠకులకు కావలసినంత వినోదం ఇస్తున్నాయి. నాకైతే చిరాకేస్తుంది. జగన్ రోశయ్యలలో – ఎవరైతే ఏమిటి ?
రోశయ్య మొన్నటి దాకా ముఖ్యమంత్రి పదవి తలకి మించిన భారం అని చెప్పి, ఇప్పుడు అధిష్టానంతో చర్చించి మంత్రులను మారుస్తానని ఇండైరక్ట్ గా బెదిరించడం వింటుంటే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా రాజకీయ నాయకుడినే అనిపించాడు. గుంటనక్క రాజకీయాలు నాకూ తెలుసు అన్నట్టుగా వుంది.
“వై.యస్ లేకపోతె ఆంధ్రప్రదేశ్ లో ఇంత స్ట్రాంగ్ గా కాంగ్రెస్ వుండేదా ?” అనే ప్రశ్నకు జవాబు తెలిసి కూడా జగన్ కు విలువ ఇవ్వకపోవడం వింతగా వుంది.
జగన్ కు విలువ ఇవ్వనపుడు రాష్ట్రం తగులబడి పోయినా మాకు నష్టం లేదంటున్న జగన్ వర్గీయుల మాటలు వింటుంటే కొద్దిగా బాదగా వుంది.
బయట నుంచి వినోదాన్ని చూడవలసిన చిరంజీవి అందులో భాగమై ఏమి చెయ్యాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ వింత మాటలు మాట్లాడుతుంటే అమితాబ్(click here) చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తుంది.
రాజకీయలపై అమితాబ్ అభిప్రాయం:
రాజకీయం ఒక సంక్లిష్ట ప్రపంచం. రాణించలేకపోతే అక్కడ అనుభవ రాహిత్యుడిగా , అపరిచితుడిగా మిగిలిపోతాం.
కాంగ్రెస్ లో తెలంగాణ నాయకుల వాయిస్ గట్టిగా వినిపించడానికి కె.సి.ఆర్ కారణం అనడంలో ఎటువంటి సందేహం లేదు.


