అదుర్స్ ఆడియో ఫంక్షన్‌లో:

అదుర్స్ సినిమా మగధీర సినిమా రికార్డ్స్ ను బద్దలు కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను - రాజమౌళి

శక్తి ఫ్లాప్ టాక్-బద్రీనాథ్ పోస్టర్స్ రిలీజ్ సందర్భంలో:

కండ వుండే యోధులకే కత్తి తిప్పే అర్హత వుంటాది :) అల్లు శీరిష్

పై విధంగా సరదాగా అమాయక పిచ్చి అభిమానులను చిన్నగా గిల్లి వదిలేస్తే కావల్సినంత పబ్లిసిటీ ఇస్తారు.

మగధీర సినిమా తెలుగు సినిమాలకు కొత్త రికార్డ్స్ ను సెట్ చేసింది. హిట్ అయిన ప్రతి సినిమాను మగధీర సినిమాతో రెండు రకాలుగా పొల్చడం జరుగుతూ వుంటుంది. 1) కలక్షన్స్ 2) ఎమోషన్స్. కలక్షన్స్ ను కొట్టే సినిమా నాకైతే కనుచూపు మేరలో కనపడటం లేదు. ఎమోషన్స్ లో కూడా మగధీర తర్వాత మగధీరకు దీటైన సినిమా రాలేదు.

తీన్‌మార్ సినిమా పవన్ అభిమానులను పవన్ వీరాభిమానులుగా మార్చగా, వీరాభిమానులకు తీన్‌మార్ లాంటి సినిమా ఇంకా కొద్దిగా ముందు వచ్చివుంటే బాగుండేదనిపించింది. అభిమానులకే పరిమితం కాకుండా ఒక సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాని తెలుగులో మేజర్ ప్రేక్షకులైన మాస్, కిడ్స్ ఆశీంచే అంశాలు ఈ సినిమాలో లేకపొవడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ సన్సేషనల్ సక్సస్ గా నమోదు చేసుకొలేదు. తీన్‌మార్ సినిమా పవన్‌కల్యాణ్‌ను బ్యాక్ టు ఫామ్ లోకి తీసుకొచ్చింది మరియు పవన్ అభిమానులలో నెలకొని వున్న నిరుత్సాహాన్ని పారద్రొలింది.

తీన్‌మార్ తర్వాత తెలుగుసినిమా అభిమానుల కళ్ళన్నీ ఇప్పుడు బద్రీనాథ్ మీదే వున్నాయి. బద్రీనాథ్ కలక్షన్స్ పరంగా మగధీరను రీచ్ కాలేకపొవచ్చు, కాని వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే పొరాట సన్నివేశాలు మాస్‌కు రీచ్ అవ్వడంలో పొటీ పడవచ్చు అనిపిస్తుంది.