బద్రినాథ్ పబ్లిసిటీ చాలా కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది.

కానీ నరసింహనాయుడు, ఇంద్ర సినిమాలకు కథ అందించిన చిన్నికృష్ణ కథ. ఆది, ఠాగుర్ సినిమాల దర్శకుడు వి.వి. వినాయక్ డైరక్షన్. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెరఫార్మన్స్. ఈ మధ్య ఖర్చుకు వెనుకాడని గీతా ఆర్ట్స్. ఈ అంశాలు కన్‌ఫ్యూజుడ్ పబ్లిసిటీని డామినేట్ చేసి సినిమా చూడాలని కాకుండా సినిమా ఎలా వుంటుందనే ఆసక్తిని పెంచాయి.

ఈ తరం దర్శకులు తమ సొంత కథలు తప్ప, బయట కథలు చేయడం చాలా అరుదు. వి.వి. వినాయక్ మాస్‌ను ఆకట్టుకునే విధంగా కథ చెప్పడం బాగానే వుంది కానీ, తన కథ కాకపొవడంతో పట్టుగా చెప్పలేదనిపించింది. ఈ సినిమాకు అత్యంత కీలకం ఫైట్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించలేదు,

చిన్నికృష్ణ కథ మొదలు. కథకు రెండు ముడులు వెయ్యడంలో సఫలీ కృతుడయ్యాడు, కానీ ముడులు విప్పడంలో విఫలం చెందాడు. సెకండాఫ్ రన్ కోసం అన్నట్టు సీన్స్ అల్లారు తప్ప, కథకు మంచి ముగింపు(అందరూ మెచ్చే విధంగా) ఇవ్వలేదు.

గీతా ఆర్ట్స్ ఖర్చు, అల్లు అర్జున్ హార్డ్ వర్క్ & ఎనర్జిటిక్ పెరఫార్మన్స్ ఈ సినిమాకు వృధా అనిపించినా ఈ సినిమాకు అవే బలంగా నిలిచాయి.

నాకు సినిమా పబ్లిసిటీ డిపార్టమెంట్‌లో పని చెయ్యాలని కోరిక. ఈ సినిమా పబ్లిసిటీ పగ్గాలు నాకు అప్పగిస్తే ఎలా చేసే వాడినని ఆలోచిస్తుంటే “చాలా కష్టమైన పని” అని అనిపించింది.

ఓవరాల్ గా చూస్తే ‘మగధీర’ లా అందరికీ నచ్చే సినిమా కాదు, మాస్‌కు నచ్చి ఎవరేజ్‌గా నిలిచే చిత్రం అనిపించింది.