ప్రతి హిరో అభిమానికి రెండు ప్రశ్నలు వుంటాయి:
1) సినిమా మనకు నచ్చిందా ?
2) సినిమా జనాలకు నచ్చుతుందా ?
మనకు నచ్చి జనాలకు కూడా నచ్చితే ఆనందానికి హద్దులు వుండవు. పోకిరి ఆ కోవలోకే వస్తుంది. పోకిరి సినిమా ఆ రేంజ్ రావడానికి “అతడు” సినిమాతో మహేష్‌బాబు సంపాదించిన ఇమేజ్ కూడా ఒక కారణం.
ఇప్పుడు ఖలేజా తర్వాత వస్తున్న దూకుడు సినిమా పోకిరి రేంజ్ రీచ్ అవ్వడానికి అవకాశం వున్న సినిమాగా అనిపిస్తుంది. ఖలేజా ద్వారా కొత్త నటనకు శ్రీకారం చుట్టిన మహేష్‌బాబు నటనను, దూకుడు సినిమాలో శ్రీనువైట్ల సమపాళ్ళలో వుపయోగించుకొని తెలుగుప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‍మెంట్ ఇవ్వనున్నాడనిపిస్తుంది.



