దూకుడు సినిమా ఇండస్ట్రీ హిట్టా కాదా అనే వివాదాన్ని పక్కన పెడితే, దూకుడు సినిమా రిజల్ట్ మహేష్‌బాబుకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుందని ఆయన ట్వీట్స్ ద్వారా గమనించవచ్చు. ఆ ఆనందాన్ని మరో సినిమా చాలా తక్కువ టైంలో ఫినిష్ చేయడం ద్వారా ఎంజాయ్ చేస్తూ, తెలుగు ప్రేక్షకులను మరోసారి రంజింప చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు అందరి కళ్ళూ మహేష్‌బాబు సినిమా ’ది బిజినెస్ మ్యాన్’ మీదే వున్నాయి.

రామ్‍‌చరణ్ ’రచ్చ’ 2012 సంక్రాంతికి రిలీజ్ కావడం లేదు. జనవరి 26 వుండవచ్చు. సో ..ఇక 2012 సంక్రాంతికి మాహేష్‌బాబుతో పోటి పడేది బాలకృష్ణ, రవితేజ. మహేష్‌బాబు ’ది బిజినెస్ మ్యాన్’, బాలకృష్ణ ’అధినాయకుడు’ మరియు రవితేజ’నిప్పు’. వరుసగా జనవరి 11, 12, 13 తేదిలలో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.

ఇంతకు ముందు బాలకృష్ణ ’సమర సింహా రెడ్డి’, ’నరసింహనాయుడు’ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మహేష్‌బాబు ’ఒక్కడు’ కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అయ్యింది. రవితేజ లేటేస్ట్ బ్లాక్ బస్టర్స్ ’కృష్ణ’, మిరపకాయ్ సంక్రాంతి టైంలోనే రిలీజ్ అయ్యాయి.

సంక్రాంతి టైంలో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం మామూలే. ఈసారి 2012 సంక్రాంతి ఎవరికి లక్‌గా మారి కాసుల వర్షం కురిపిస్తుందో వేచి చూడాల్సిందే.