మహేష్‌బాబుతో హిట్ కొట్టలేక పొతే, అది ఆ దర్శకుడి అసమర్దతే – శ్రీను వైట్ల
అది శ్రీను వైట్ల అభిప్రాయం. మహేష్‌బాబు మీద నిజంగా ఆయనకు వున్న నమ్మకం అయ్యి వుండవచ్చు, లేదా నెక్స్ట్ సినిమాకు సోపింగ్ అయివుండవచ్చు. కచ్చితంగా శ్రీను వైట్ల అభిప్రాయంతో ఏకీభవించని వాళ్ళెందరో వుంటారు.
ఎవరు హిట్ కొడితే ఆ హిరో అభిమానులు మా హిరో నెం 1 అని చెప్పుకోవడం మామూలే. చిరంజీవి తర్వాత ఈ హిరో నెం 1 అని కచ్చితంగా చెప్పడం కష్టం. నెం 1 స్థానం ఖాళీగా వుందని చెప్పవచ్చు. పలానా నెం 1 హిరో అని చెప్పడానికి కచ్చితమైన కొలమానాలు ఏమి లేవు. నా దృష్టిలో శ్రీను వైట్లకు పై విధంగా అనిపించినట్టు తెలుగు ప్రేక్షకులందరికీ అనిపించిన రోజు మహేష్‌బాబు నెం 1 అని డిక్లేర్ చేసేయవచ్చు. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులకు మాత్రం కచ్చితంగా మహేష్‌బాబే నెం 1. ఎందుకంటే సినిమా టాక్, డైరక్టర్ తో సంబంధం లేకుండా మహేష్‌బాబు మీద నమ్మకంతో ఆయన సినిమాలు ఇరగబడి చూస్తూ వుంటారు. ఒకప్పుడు అమెరికాలో పవన్ కళ్యాక్ కు అటువంటి క్రేజ్ వుండేది.



