“It’s official. దూకుడు సినిమా మగధీరను నాలుగు వారాల్లో కొట్టేసింది” అంటూ మహేష్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్లు బాగానే పడుతున్నాయి. అటువంటి కౌంటర్లల్లో ఆఫీషియల్ మెగా పబ్లిసిష్ట్ చేసిన కామెంట్ ఇక్కడ:
sknonline sreenivas kumar
Will #7thsense create records like Robo in AP? till date Robo still holds record(2nd place) in Nizam after Magadheera.
తమిళంలో రూపొందిన ‘7ఎఎం అరివు’ చిత్రాన్ని తెలుగులో ‘7th సెన్స్’ పేరుతో అనువదించారు. ‘గజని’ ఫేం దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను లక్ష్మి గణపతి ఫిలింస్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం విడుదల చేస్తున్నారు. సూర్య తొలిసారిగా హిస్టారికల్ మెడికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సర్కస్ వాలాగా, ఫైటర్ గా, లవర్ బోయ్ గా 3విభిన్న పాత్రల్లో సరికొత్త అవతారాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. సూర్య సరసన శృతిహాసన్ జంటగా నటించింది.
కాగా దసరా సీజన్ దూకుడు, ఊసరవెల్లి హడావిడి తర్వాత ఇప్పుడు అందరి చూపు సూర్య-మురుగదాస్ సినిమా ‘7th సెన్స్’ పైనే వుంది. 26న దీపావళి కానుకగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో చాలా హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. సూర్య పెర్ ఫార్మెన్స్ , మురగదాస్ టేకింగ్ హైలైట్ గా నిలిచే ’7thసెన్స్’ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ మూవీగా చెప్పుకునే రీతిలో వుంటుందని మురగదాస్ చెప్తున్నాడు.



