నీ చుర చుర చూపులే .. పంజా
సల సల సల ఊపిరే .. పంజా
నర నరమున నెత్తురే .. పంజా

అణువణువునా సత్తువే .. పంజా
అలుపెరగని వేగమే .. పంజా
అదరని పెను ధైర్యమే .. పంజా
పెదవంచున మౌనమే .. పంజా
పదునగు ఆలోచనే .. పంజా

హే .. చీకటిలో చీకటిగా ..
మూసిన ముసుగ నిప్పుల బంతి
తప్పదనే యుద్దముగ వేకువ చూడదా రేపటికంటే

ఆకాశం .. నీ పంజా ..
అది గెలవాలి ..
అసలైన గుండె దమ్ముగా

ఆవేశం .. నీ పంజా ..
అడుగెయ్యాలి ..
చేడునంతం చేసే చైతన్యంగా

ఆటుపోటు లేనేలేని సాగరమే ఉంటుందా?
ఎత్తుపల్లం లేనేలేని రాదారంటు ఉందా?
ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా?

ఎదేమైనా తుదివరకు ఎదురీత సాగాలి గా..

ఈ అడుగడుగు అలజడిగా ..
నీ జీవితమే నీ శత్రువు కాదా ..
బెదిరించే ఆపదనే ఎదురించే గుణమేగా పంజా..

ఆకాశం .. నీ పంజా .. అది గెలవాలి ..
అసలైన గుండె దమ్ముగా

ఆవేశం .. నీ పంజా .. అడుగెయ్యాలి ..
చేడునంతం చేసే చైతన్యంగా