రివ్యూస్

నేను సినీ విమర్శకుడిని కాదు. నేను మూవీ లవర్‌ని. అందుకనే నాకు ఆల్ మోస్ట్ అన్నీ సినిమాలు నచ్చుతాయి మరియు నా రివ్యూ అన్నీ పాజిటివ్ గా వుంటాయి. మనకు నచ్చలేదని అందరికీ నచ్చదు అనుకోవటం తప్పు అనేది నా అభిప్రాయం.

నేను రాసేది సినిమా రివ్యూ కాదు. నేను వ్రాసేది స్పందన అనుకోవచ్చు ఏమో. రైట్ వర్డ్ నాకు తట్టే దాకా రివ్యూ అనే లెబెల్ చేస్తా. ఇబ్బందిగా అనిపించినా సర్దుకుపోతారని ఆశీస్తున్నాను.

నా సినిమా రివ్యూస్/స్పందన, మీ వ్యూస్ తో మాచ్ కావాలని అవుతుందని గ్యారంటీ లేదు. have your own judgement.

సినిమా మనకు నచ్చిందో, నచ్చలేదో పక్కన పెట్టి ప్రేక్షకుల తీర్పును గౌరవించాలి. ఎందుకంటే డ్రైవింగ్ ఫోర్స్ అదే కాబట్టి. నేను పూర్తీ స్థాయి లేదా ఫుల్ టైం సినిమా విశ్లేషుకుడిని కాదు కాబట్టి సినిమాలో ఏమి చెప్పాలనుకున్నారో, చెప్పాలనుకుంది బాగా చెప్పారా లేదా అనే కోణంలోనే నేను సినిమాలు చూస్తూ వుంటా.

సినిమా హిట్టో, ఫట్టో అని కేర్ చెయ్యడం ఎప్పుడో మానేసాను కానీ, ప్రేక్షకులు చూసేటప్పుడు, చూసిన తర్వాత ఎలా ఫీల్ అవుతారని కాసేపు ఆలోచిస్తున్నాను. ప్రేక్షకుల నాడి పట్టుకునే ప్రయత్నం అన్నమాట.

“తొక్కలో విశ్లేషణలు ఎవరికీ కావాలి ? సినిమా హిట్టో, ఫట్టో ఒక్క ముక్కలో చెప్పు” అని కోరుకునే వారి సంఖ్యే ఎక్కువ. కానీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఫైనల్ గా సినిమాపై ప్రేక్షకతీర్పు ఏమిటి అనేది గెస్ చెయ్యడం చాలా కష్టం అనేది నా అభిప్రాయం.

ఇక్కడ ఒక లాజిక్ వుంది. తెలుగులో 90% సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనుకుందాం. నేను అన్నీ సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి “సినిమా ఫ్లాప్” అని చెపుతూ వచ్చాను అనుకోండి, నేను 90% కరక్ట్ గా చెయ్యగల్గాను అని చెప్పుకొవచ్చు.

సినిమాకు పనిచేసే వాళ్ళు మా సినిమా 100% హిట్ అవుతుంది అనే చెపుతారు కాబట్టి, 90% వారు అబద్ధం చెపుతున్నరనే భావన అందరిలోను వుంది.

ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏమిటి ?

  1. ప్రేక్షకుల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి సినిమా మేకర్స్ చెప్పాలనుకుంది సిన్సియర్ గా ప్రేక్షకులను మెప్పించే తీరులో చెప్పే ప్రయత్నం చెయ్యడమే.
  2.  

  3. సినిమా విశ్లేషుకులు సినిమా ప్రేక్షకులను మార్గనిర్దేశన చెయ్యాలి తప్ప వ్యక్తిగత లాభాల కోసమో పైశాచిక అనందం కోసమో సినిమా రివ్యూలు వ్రాయకూడదు.
  4.  

ఫస్ట్ డే మార్నింగ్ షో:
ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే, without knowing talk of the movie, మూవీ చూడటం . ఫస్ట్ డే మార్నింగ్ షో అంటే నాకు భలే ఇష్టం. సినిమా టాక్ తెలియకుండా చూడటం ఒక థ్రిల్. మనమే టాక్ స్ప్రెడ్ చెయ్యడం మరో పెద్ద థ్రిల్. అదే పెద్ద హిరో అయితే, మార్నింగ్ షో చూసి బయటకు వచ్చేటప్పుడు, బయట ఫ్యాన్స్ “సినిమా ఎలా వుందో అని మన ఫేస్ రీడింగ్ ద్వారా చూసే ప్రయత్నం” థ్రిల్స్ కే థ్రిల్. ఏ మూవీ అయినా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడటానికే ప్రయత్నిస్తాను. ఇప్పుడు అంటే కుదరడం లేదు కానీ, ఒకప్పుడు బాగానే కుదిరేది. నేను చాలా సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినా, అందులో మెగా మూవీస్ లిస్టు ఎక్కువ. మా పెద్దన్నయ్య అయితే, he never missed ఫస్ట్ డే మార్నింగ్ షో of chiranjeevi movie until HITLER. ఆ తర్వాత, చిరంజీవి కంటే తన వ్యక్తిగత బాద్యతలు ఎక్కువ అని తెలుసుకున్నట్టు వున్నాడు.

ఫస్ట్ డే మార్నింగ్ షో రివ్యూ:
some times మన ఫస్ట్ డే మార్నింగ్ షో రివ్యూ/టాక్ could be totally wrong. నేను ఆ విధంగా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా వున్నాయి. భారీ అంచనాలతో , ఆవేశంతో , అత్యుత్సహంతో చూస్తాం కాబట్టి ఎక్కువ సార్లు మన ఫస్ట్ డే మార్నింగ్ షో రివ్యూ/టాక్ ఫెయిల్ అవ్వడానికే చాన్స్ ఎక్కువ.