పెద్దాయన

ఎవరీ పెద్దాయన?
నాకు తెలిసిన, కావలసిన వ్యక్తి. మొహమాటం లేకుండా నన్ను విమర్శించగలరు.

ఆయన అవసరం ఏమిటి?
90% విమర్శలలో నిజాయితీ కొరవడుతుంది. ఇప్పుడు విమర్శ అంటే ఏడుపు, విమర్శకులు అంటే శత్రువులు. ఇటువంటి విపత్కరమైన కాలంలో విమర్శలను పట్టించుకోవడం వలన ఉపయోగం లేదు. కానీ మనం చేసే తప్పులు విమర్శకులే బాగా గుర్తించగలరు. అందుకే నా బ్లాగును విమర్శా కోణంలోనే చదవమని ఆయనను రిక్వెస్ట్ చేశా.

why కామెంట్స్ are closed ?
కొన్ని కొన్ని టపాల ఉద్దేశం, భావం అందరికీ పూర్తిగా అర్ధం కావు. దానికి కారణం వ్రాసేటప్పుడు కొన్ని కొన్ని assumtions చేసుకోవడం జరుగుతాది. assumtions అంటే చదివే వాళ్ళకు ఆ విషయంపై అవగహన వుంటుందనే ఉహా. కామెంట్స్ ద్వారా అటువంటి డౌట్స్ నివృత్తి చేయవచ్చు. కామెంట్స్ క్లోజ్ చెయ్యడం వలన ఈ అవకాశం వుండదు అని తెలుసు కానీ, కామెంట్స్ క్లొజ్ చెయ్యడానికి కారణాలు:

  1. ఈ బ్లాగు చర్చించడానికి, వాదించడానికి మాత్రం కాదు. నా అభిప్రాయాలు వ్యక్తపరచడానికే.
  2. కామెంట్స్ ను అర్ధం చేసుకోవడం కంటే అపార్ధం చేసుకోవడమే ఎక్కువ జరుగుతూ వుంటుందని అనే అభిప్రాయంతో కూడా నా బ్లాగులో కామెంట్స్ క్లోజ్ చేసాను.
  3. నా పోస్ట్స్( అంత క్రియేటివ్ కాదు) కు పెద్దగా కామెంట్స్ చెయ్యడానికి ఏమీ వుండదు .. కామెంట్స్ క్లోజ్ చెయ్యడానికి అది కూడా ఒక రీజన్.
  4. ఏకాభిప్రాయానికి రాని చర్చలు వాదనలు బదులు, మీ అభిప్రాయాన్ని జస్ట్ కామెంట్స్ తో వేస్ట్ చెయ్యకుండా ఒక టపాగా మీ బ్లాగులోనే వ్రాసుకోండి.
  5. మనకి తెలిసినది పంచుకోవడం అన్నది మంచి లక్షణమే, కాని అది ఇతరులకి అవసరం అయినప్పుడు మాత్రమే చెప్పాలి. తమగురించి నలుగురు చెప్పుకోవాలని మాత్రం కాకూడదు. వాక్చాతుర్యతతో ఇతరులని ఓడించాలి అన్న దిశలో వాదోపవాదాలు చెయ్యడంలో ఏ మాత్రం అర్థం లేదు. అనవసర కాలయాపన తప్ప, ఒరిగేదేమీ ఉండదు. ఇది, మరిన్ని వాదోపవాదాలకు /మనస్థాపాలకు దారి తీస్తుందే కాని, జ్ఞానాన్ని పంచదు. నాకు ఆనందం కలిగించే విషయాలు పంచుకుంటూ, బాద కలిగించే విషయాలను విమర్శిస్తూ ఆనందంగా మలుచుకునే ప్రయత్నమే నా ఈ బ్లాగు. ఒకరిని కించపరిచే వుద్దేశం ఏ మాత్రమూ లేదు.
  6. నా గురుంచి నాకు బాగా తెలుసు అనే అహంకారం ఎక్కువ. నాకు ఎవరైన సలహాలు ఇస్తే పరమ చిరాకు. నా అంతట నేనే తెలుసు కోవాలనుకుంటాను. కామెంట్స్ క్లోజ్ చేయడానికి ఇది కూడా ఒక కారణం అయి వుండవచ్చు. విమర్శలు, ప్రశంసలతో పాటు సలహాలతో కూడిన విమర్శలు చదివే ఓపిక నాకు లేదు.

విమర్శలు
మనకి నచ్చని విషయం మీద విమర్శ కనిపిస్తే చాలు “చాలా బావుంది” అని అనేస్తాం. కాని కొన్ని విమర్శలు చూస్తుంటే, విమర్శలు చేతకాని వాళ్ళు చేస్తారేమో అని అనిపిస్తూ వుంది.

మనం ఒక విమర్శ చేసాము అంటే, మనం టార్గెట్ చేసిన వారితో సహా అందరినీ ఆలోచింప చెయ్యడమే కాదు, అదే విమర్శ మన మీద చెయ్యకూడని విధంగా వుండాలి. మనకు నచ్చని విషయం మీదే, నచ్చని వ్యక్తుల గురుంచే 24 గంటలు ఆలోచిస్తూ కూర్చోవడం ఎంతవరకు సబబు?. 100 పొగడ్తలు , 1 విమర్శ వుంటే 1 విమర్శకే మొదట సమాధానం వస్తుంది. విమర్శకు అంత ప్రాధాన్యత వుంది. నా బాద ఏమిటంటే ఈ రోజుల్లో విమర్శలు విమర్శలను IGNORE చేసే స్థాయిలో జరుగుతున్నాయి. విమర్శలు స్పందించే విధంగా వుండాలి.

శత్రువులు
ఒక విషయం మీదో, ఒక వ్యక్తి మీదో విమర్శలు చేస్తున్నప్పుడు సంబంధిత వ్యక్తులు స్పందించే విధంగా వుండాలి.

ప్రతి మనిషి బయటకు చెప్పినా , చెప్పకపోయినా అంతర్లీనంగా కోరుకునేది ఆదిపత్యం మరియు గౌరవం.

అవి సాధించడానికి, నిలబెట్టుకోవడానికి ఒక్కొకరు ఒకో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది నిరంతర పోరాటం.

ఎవరైనా నేను అన్నీ సాధించేసాను అనుకున్న మరుక్షణమే డభీమని క్రింద పడటం ఖాయం.

నాకు కూడా కులం, మతం , ప్రాంతం అభిమానాలు వున్నాయి. కానీ వాటిని మన అభివృద్ధి కోసమో , భద్రత కోసమో వాడుకోవాలి తప్ప ఒకడి నాశనానికి వాడుకోకూడదు.

తప్పు ఎవరు చేసినా తప్పే. మనవాడు చేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా ?

నాకు తప్పు అనిపించిన పని నేను చేయను. నాకు తప్పు అనిపించిన దానిని ఖండించాలి అని వున్నా, అది వేరే వాళ్ళ దృష్టిలో ఒప్పు అయివుండవచ్చు అనే వుద్దేశంతో మౌనం పాటిస్తున్నాను.

మన అభిప్రాయాల్ని ఎవరైనా ఖండిస్తే వీడు మన శత్రువు అనే ఫీలింగ్ ఇప్పటి సమాజంలో ఎక్కువ వుంది. నేను చిరంజీవిని, చంద్రబాబును, రాజశేఖర రెడ్డిని ఘాటుగానే విమర్శిస్తున్నాను. ఆ విధంగా నాకు ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో శత్రువుల సంఖ్య తక్కువ ఏమీ లేదని మొన్ననే గ్రహించాను.

నేను చేసే విమర్శలు పొగడ్తలు నేను ఏమిటో నాకు తెలియడానికి ప్లస్ నా రీడింగ్-రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడానికే తప్ప ఎటువంటి దురుద్దేశం కాని, స్వలాభం కాని లేవు.

నిజమైన నా శత్రువులు:
కోపం: నేను చాలా శాంతంగా కనిపిస్తాను. కానీ కాదు. నాకు నచ్చని అభిప్రాయాలను విన్నా, చదివినా, చూసినా నాకు ఎనలేని కోపం వచ్చుద్ది. వాదించినంత మాత్రానా ఒకరి అభిప్రాయం మారదు అనే అభిప్రాయంతో మౌనమే నా సమాధానంగా వూరుకుంటాను. ఎదుటి అభిప్రాయాలలో నిజం వుంటుంది , వాటిని గౌరవించాలనిపించినా దానిని పాటించలేకపోతున్నాను. నా కోపాన్ని పదర్శించక పోవడం నాకు వున్న పెద్ద లోపమో, లేక అదే నాకు ఎసట్టో తెలియడం లేదు. ఒకరి అభిప్రాయాన్ని ఖండిస్తే వారికి మనం శత్రువులుగా కనిపించడం తప్ప ఉపయోగం లేదన్న నా చిన్ననాటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మౌనంగా వుండటమే బెటర్ అనిపిస్తుంది. కోపాన్ని మాత్రం జయించ లేకపోతున్నాను. నా దృష్టిలో కోపాన్ని జయించడం అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కాదు, అసలు కోపమే రాకపోవడం.

ఈర్ష్య: నాకు ఈర్ష్య లేదు అని అంటాను కానీ, అది పచ్చి అబద్ధం. అంతర్లీనంగా ఎక్కువే వుందని ఇప్పుడు తెలుస్తుంది.మన కష్టానికి మనకు ఎంత ప్రాప్తమో అంతే మనకు దక్కుతుంది అని తెలుసు. ఆ నిజాన్ని నేను జీర్ణించుకున్నట్టే అనిపించినా ఆలోచనలను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఈర్ష్యను జయించాలంటే ఒక్కటే మార్గం, నేను కనే కలలు కోసం నిరంతరం, ప్రతిక్షణం కష్టపడటమే.

నిర్లక్ష్యం: నేను మా ఇంట్లో చిన్నవాడిని. ఏ బాద్యాతలు లేకుండా పెరగడం వలెనే నా నిర్లక్ష్యానికి కారణం అనుకుంటూవుంటాను. నా అవసరం నిర్లక్ష్యాన్ని జయించినా, నిర్లక్ష్య మూలాన్ని జయించ లేకపోతున్నాను. నా దగ్గర మార్గం కూడా లేదు like కోపం.