తేజస్వి

అభిమానించడం నా వీక్ నెస్. సినిమాలంటే పిచ్చి వలన అది ఏర్పడింది అనుకుంట. నాకు ఈర్ష్య వుండదు అని కచ్చితంగా చెప్పలేను కానీ, అది ద్వేషంగా మారకూడదు అని కోరుకుంటూ వుంటా.. నాలో మిగిలి వున్న కొంచం ఈర్ష్య(నాలో ఈర్ష్య లేదు అని ఎంత అనుకున్నా అప్పుడప్పుడు బయట పడుతూ వుంటుంది) కూడా నా అధీనంలోకి వచ్చేస్తే నా జన్మ సార్దకమయినట్లే .. నా మనసు చిన్నప్పటి నుండి ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపేది .. నా వలన ఒకరు బాద పడకూడదు అనే నా ఆలోచనలు ఎప్పుడూ పోవు.

సంతోషం — విచారం
పొగడ్త — విమర్శ

వీటిల్లో సంతోషం , పొగడ్తల వైపే మొగ్గు చూపుతా. వాటితో పాటు నేను ఎక్కువగా ఆలోచించేది “ఒకడి ఓటమి వేరే వాడికి గెలుపు కాకూడదు” అని. అదెలా సాధ్యం అంటే ఓడిన వాడు తన ఓటమిని మనస్పూర్తిగా అంగీకరించాలి. నేను ఓటమిని అంగీకరించలేను అని తెలిసిన మరుక్షణం నాకు ఎంతో ఇష్టమైన చెస్ గేంను, గెలుపు-ఓటములు సమానం అని నేను తెలుసుకునేంత వరకు, ఆడకూడదు అని నిర్ణయించుకున్నాను.

నన్ను నేను తెలుసుకునే భాగంలో నా బ్లాగు కూడా ఒకటి.. సెల్ఫ్ డబ్బా రూపంలో వున్నా టపాలు నేను ఏలా వుంటానో, వుండాలనుకుంటానో చెపుతాయి. ప్రస్తుతం వున్నవి నాలుగు టపాలే అయినా, మనలను ఆలోచింపజేసే పదాల అర్ధం, వాటిని ఎలా అదుపులో పెట్టుకొవాలో వివరిస్తున్న బ్లాగు “తేజస్వి“, one of my favorite blogs list లో చేరిపోయింది.

సేవ గురుంచి చెప్పినవి రెండు వ్యాఖ్యలే అయినా, సేవలో ఆనందం అంటే ఏమిటో చెప్పిన తీరు బాగుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.