స్వార్ధం

ఈ రోజు ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే “ఏమి రాజకీయాలురా .. ? ఆదిపత్యం కోసం మొదలై డైలీ జీవనాన్ని చిందర వందర చేసేస్తున్నారు” అని వాడు బాదపడుతుంటే, మేము ఒక అంగీకారానికి వచ్చిన విషయంఏమిటంటే:

స్వార్ధం లేని మనిషి వుండడు అని నేను చాలా గట్టిగా నమ్ముతాను.
.
రాజకీయం అంటే ఏమి చేసినా తప్పు కాదు అనే ఫీలింగ్ అందరిలోనూ క్రియేట్ అయ్యి కూర్చోని స్ట్రాంగ్ గా సెటిల్ అయిపోయింది. మీడియా కూడా రాజకీయమయం అయిపోయి worst situation తయారయ్యింది. ఈ విధంగా చంద్రబాబు వర్గం చెట్టెక్కి కూర్చుంది. ప్రత్యన్నమయం గా వై.యస్ ఉద్భవించాడు. నాకు తిరుగులేదు అనే చంద్రబాబు గర్వమే వై.యస్ ను ముఖ్యమంత్రిని చేసింది. వై.యస్ ఐదేళ్ళలో చంద్రబాబును మించిన వర్గాన్ని తయారు చేసాడు. ఎదురు తిరిగిన వాడిని డబ్బుతో కోనేయడమో, భయపెట్టి లొంగదీసుకోవడమో చేసి దేవుడి దగ్గరికి వెళ్లి పోయాడు. మొన్నటి ఎన్నికలలో వై.యస్ కు ప్రత్యన్నమయంగా చంద్రబాబు గెలవ వలసిన వాడే. చిరంజీవి వచ్చి తనను తాను తగ్గించు కుంటూ ఒక రాజకీయ కన్ ఫ్యూజన్ క్రియేట్ చేసి చంద్రబాబు అధికారానికి గండి కొట్టాడు..

చంద్రబాబు నుంచి రాజకీయం అంటే ఏమి చేసినా తప్పు కాదు అని నేర్చుకున్న కె.సి.ఆర్ తెలంగాన ఉద్యమాన్ని రాజకీయం చేసేసాడు. రాజకీయ ఉద్దండులు చంద్రబాబు, వై.యస్ లు అధికారంలో లేని సమయంలో ప్రాంతం పేరుతొ కె.సి.ఆర్ మరో రాజకీయ హిరో అయిపోయాడు.

మనిషి తన స్వార్ధం కోసం ఎంతకైనా తెగిస్తాడు అని మొన్న చంద్రబాబు, ఈరోజు కె.సి.ఆర్ నిరూపించారు. వారు ఏమిచేసినా అది రాజకీయం అంటూ వారిని సమర్దించి భుజానికి ఎత్తుకొని మోసే మనలాంటి(including me) సామాన్య స్వార్ద పరులు ఉన్నంత కాలం మార్పు రాదు. అందుకే మార్పు కోరుకోవడం లేదు.

ప్రతిరోజూ వాదనలు, బంద్ లు అని కొట్టుకు చచ్చే కంటే రాష్ట్రాన్ని ముక్కలు చేసేయడం బెటర్. ఈ అంశాన్ని రాజకీయ నాయకులు సాగదీస్తారు కాని, ఆ పని మాత్రం చెయ్యరు .

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, వేరే వాళ్ళ అభిప్రాయం, Xclusive. Bookmark the permalink.