చంద్రబాబుకు ప్రత్యన్నమయం ఎవరు ?

కాంగ్రెస్ పార్టీకి ప్రత్యన్నమయం తెలుగుదేశం మాత్రమే అని చంద్రబాబు నమ్మకం. ఆ నమ్మకాన్ని సొంత పత్రికల సహాయంతో బాగానే ప్రజలలోకి తీసుకొని వెళ్ళాడు అని నా నమ్మకం.

చంద్రబాబుకు ప్రత్యన్నమయం ఎవరు ?

“జగనా ? చిరంజీవా ?”

ఒక్క రాజకీయ నాయకుడిని కూడా కంట్రోల్ లో పెట్టు కోలేని చిరంజీవి చంద్రబాబుకు ప్రత్యన్నమయం అవ్వడం కష్టం. ఇటువంటి పరిస్థితులలో చిరంజీవికి ప్రజలు రాజకీయంగా పట్టం కడతారనేది కలలో కూడా జరగని పని.

జగన్ – సాక్షి పేపరులో వ్రాసే దానికి, బయట జగన్ మాట్లాడే విధానానికి పూర్తి వ్యతిరేకం. వై.యస్ సృష్టించుకున్న వ్యతిరేకులు జగన్ ను ఎదగనిస్తారని నేను అనుకోవడం లేదు.

సో చంద్రబాబుకు ప్రత్యన్నమయం లేనట్టే. తెలంగాణ ప్రాంతంలో తన బలాన్ని నిలుపుకో గలిగితే చంద్రబాబుకు 2014-2024 తిరుగుండదు.

ముందు రెండు పత్రికలు,
వెనుక చిన్న పెద్ద ఎన్.టి.ఆర్ లు లేకపొతే ప్రజలు పట్టించుకొని ఒక వ్యక్తి, మహా నాయకుడిగా సాగడం సామాన్యమైన విషయం కాదు.

యర్రబెల్లి దయాకరరావు లాంటి ప్రజా నాయకుడే చంద్రబాబు కాళ్ళు మొక్కుతున్నాడు అంటే అర్ధం చేసుకొండి. చంద్రబాబును ప్రజా నాయయకుడు అనలేము కాని, నాయకులకే నాయకుడు అని మాత్రం అని అనవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.