కేడీ Xవ్యూ

ఈ మధ్య సినిమాల గురుంచి అలోచించడానికి టైం వుండటం లేదు. ఏదైనా సినిమా చూద్దాం అంటే మూడు గంటలు టైం వేస్ట్ అనిపిస్తుంది. సినిమాలంటే పిచ్చి కొద్ది కేడి సినిమా కోసం మూడు గంటలు వెచ్చించాను.

సినిమా ఎలా వుంది ?
తెలుగు సినిమాలా లేదు. ఇది లోపం అని అనలేను కాని, right mood లో సినిమా సాగలేదు అని చెప్పవచ్చు. డబ్బింగ్ సినిమానా అనే డౌట్ వచ్చింది.

టైం వేస్ట్ అనుకుంటూ ఈ సినిమా చూడటంలో ప్రత్యేకత ఏమిటి ?
డైరక్టర్ ఇంటర్వ్యూ లో రెండు మూడు మాటలు విన్నాను. అతని మాటలు ఎంతో లోతుగా వున్నాయి. అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ సినిమా మిస్ అవ్వ కూడదు అని. సినిమా బాగోలేదు అనే టాక్ తెలిసి చూసాను కాబట్టి, నేను ఎక్సపెట్ చేసిన పార్ట్ మాత్రం డైరక్టర్ డిస్సాపాయింట్ చెయ్యలేదు.

డైరక్షన్ అంత బాగుందనా నీ అర్ధం ?
కాదు. అతను వ్రాసిన డైలాగ్స్ చాలా లోతుగా వున్నాయి. నాకు నచ్చాయి. నేను స్పెండ్ చేసిన మూడు గంటలు వర్త్ కాకపోయినా, ఒక సినిమా పిచ్చోడిగా బాద మాత్రం పడలేదు. I could able to see what is missing in the movie.

సినిమా చూడవచ్చా ? ఎందుకు చూడాలి ?
ఈ ప్రశ్నకు సమాధానం, ప్రశ్న అడిగే మనుషులను బట్టి మారుతూ వుంటుంది. ఈ సినిమా విషయంలో అందరికీ ఒకే సమాధానం “చూడవలసిన సినిమా ఏమీ కాదు”.

(సశేషం)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా. Bookmark the permalink.