నిరంతర ప్రయత్నం

ఏదైనా సాధించాలంటే తపనతో పాటు నిరంతర ప్రయత్నం కూడా వుండాలి.

ప్రస్తుతం నా లక్ష్యం ఏమిటని ఆలోచించుకుంటే “డబ్బు అంటే విరక్తి వచ్చేంత డబ్బు సంపాదన” అని తేలింది. ఆ డబ్బును సేవ చేస్తూ సాధించాలని నా కల. ఆ కల నెరవేరుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే, నా కనీస బాద్యతలు తీర్చడానికి గత పదేళ్లుగా కష్ట పడుతూనే వున్నాను. ఈ పదేళ్ళలో నా అవసరాలకు కావలసిన డబ్బు మాత్రమే సంపాదించగల్గాను కాని, నా కలను నేరవేర్చుకోవడానికి మాత్రం సంపాదించ లేకపోయాను. దేవుడు అవసరాలకు మాత్రమే మార్గం చూపిస్తాడు, కలలు నిజం చేసుకోవాలంటే నిరంతర ప్రయత్నం చెయ్యాలి. నా ప్రయత్న లోపాన్ని గుర్తించాను. ఏ విషయాన్ని అయినా క్షుణంగా తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.