చిరంజీవికి నా సపోర్ట్ ఆగదు

పెద్దాయన: చిరంజీవిని వదిలేసావా ?
నేను: చిరంజీవి ఒక శక్తి. ఒక స్పూర్తి. రాజకీయంగా అసమర్దుడు అయినంత మాత్రాన వదిలెయ్యడం వుండదు సార్. మా ఫ్రెండ్ చెప్పినట్లు(click here) చిరంజీవి మార్గమే కరెక్ట్ అయ్యి గెలుపు సాధించ వచ్చేమో. ఎవరికీ తెలుసు సార్ ?

పెద్దాయన: ఇంకా ఆశ వుంది అన్నమాట.
నేను: మానవుడు ఆశాజీవి. చిరంజీవిని నమ్మి ప్రజలు గెలిపించక పోవచ్చేమో కాని, చంద్రబాబు కు ప్రత్యన్నమయంగా కొన్ని రాజ కీయ పక్షులు చిరంజీవి చెంత చేరవచ్చు అనిపిస్తుంది. చంద్రబాబు కు ప్రత్యన్నమయంగా చిరంజీవికి జగన్ పోటి వుండటం, చిరంజీవి రాజకీయ జీవితానికి పెద్ద మైనస్సు.

పెద్దాయన: మొదట్లో చిరంజీవి ఏమి చేసినా సపోర్ట్ చేసేవాడివి. ఇప్పుడు ఎందుకు చెయ్యడం లేదు ?
నేను: రాజకీయం అంటే దురాభిప్రాయం తప్ప సదాభిప్రాయం లేదు. రాజకీయంలో గెలుపు మార్గం కలుషితం. మార్గం కలుషితం అయినపుడు, అదొక్కటే మార్గం అయినపుడు చిన్న చిన్న తప్పులు నాకు తప్పులుగా అనిపించలేదు. అందుకే సపోర్ట్ చేసాను.

పెద్దాయన: ఇప్పుడు తప్పులుగా కనిపిస్తున్నాయా ?
నేను: కాదు. చిరంజీవి ఎవరిని అదుపులో పెట్టు కోలేక పొతుంన్నందుకు బాధతో చిరంజీవిని మనస్పూర్తిగా విమర్శిస్తున్నాను(నిజమైన నా మనసులోని మాటలు బయట పెడుతున్నాను).

పెద్దాయన: ప్రజారాజ్యం కోసం ఏమి చేస్తున్నావు ?
నేను: ప్రజారాజ్యం కోసం కాదు కాని, ప్రస్తుతం నా కోసం నేను జీవిస్తున్నాను. ఇప్పుడు సరస్వతి దేవే నాకు కనిపిస్తుంది. కొంత కాలం తర్వాత ప్రజా రాజ్యం కోసం ఏమి చెయ్యాలని ఆలోచిస్తాను. తప్పకుండా చిరంజీవి అభిమానిగా ఏదో ఒకటి చేస్తాను.

పెద్దాయన: సినిమాలు చూడటం ఎందుకు మానేసావు ?
నేను: ఇప్పుడు సరస్వతి దేవే నాకు కనిపిస్తుంది. బ్లాగు వ్రాయడం కూడా టైం వెస్ట్ అనిపిస్తుంది. సినిమాలు, రాజకీయాలు గురించి ఆలోచించడం ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాను. నా అంతిమ లక్ష్యం సినిమా, సామాజిక సృహతో కూడిన రాజకీయమే కాబట్టి వాటిని వదిలెయ్యడం జరగదు. చిరంజీవి రాజకీయలలో వున్నా లేకున్నా, రాజకీయలపై నా అబిప్రాయాలు వెలబుచ్చడం ఆగదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.

One Response to చిరంజీవికి నా సపోర్ట్ ఆగదు

వ్యాఖ్యలను మూసివేసారు.