మార్పు రాదు, మార్పు అవసరం లేదు

హైదరాబాద్ కోసమో,
తెలుగు వాళ్ళు కలిసుండాలి అనే పిచ్చి భ్రమో,
విడిపోతే హైదరాబాద్ మాది అని చెప్పుకోలేము అని బ్రాంతో,
హైదరాబాద్ లో భద్రత వుండదు అని భయమో

ఇప్పటికైనా “సమైక్యాంధ్ర” నినాదం చేసున్న వారిపై నాకు గౌరవం వుంది. కాని నా మనసు లోని మాట ఇది:

హైదరాబాద్ కోసం “సమైక్యాంధ్ర” నినాదం చేస్తున్న వారు డైరక్ట్ గా హైదరాబాద్ రాగం( like దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ ) చేసుంటే ఈ అంశం క్లైమాక్స్ చేరేది అని నా నమ్మకం.

నా పరిధి లోని తెలుగు వాళ్ళు కోరుకునేది “మన ప్రాంతం వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు తెలంగాణ వాళ్ళ చేత మాటలు అనిపించు కోవడం ఏమిటి ? తెలంగాన ఇవ్వడం వలన మనకు నష్టం లేదు. రాష్ట్రం విడిపోతే అభివృద్ధి మన దగ్గర కూడా జరుగుతుంది కదా, ప్రత్యేక తెలంగానను ఎందుకు వ్యతిరేకించాలి ? “.

ఇవే మాటలు బొత్సా సత్య నారాయణ చెప్పాడు. మొన్నటి వేడిలో చిరంజీవి సమైక్యాంధ్ర అని కాకుండా బొత్సా చెప్పిన మాటలు చిరంజీవి చెప్పి వుంటే ఎంతో ఆనంద పడే వాడిని.

సమస్య పరిష్కారం వైపు కాకుండా, టి.ఆర్.యస్ రాజీనామాల దగ్గరకే వచ్చి ఆగడం బాదాకరం. తెలంగాణ ప్రజా ప్రతి నిధులు అందరూ రాజీనామాలు చేసి కేంద్రం పై ఒత్తిడి తీసుకు రాలేక పోవడం విచారకరం.

ప్రజలను రెచ్చగొట్టే మాటల యుద్దాలు ఆగాలి. మేము రెచ్చగొడితే ఒప్పు, మీరు రెచ్చగొడితే తప్పు అనే ధోరణిలో మార్పు రావాలి.
సామాన్య జన జీవనానికి ఇబ్బంది లేకుండా ఉద్యమం శాంతియుతంగా జరగాలి.

రాజకీయం అంటే కుట్రలు, మోసం. మార్పు రాదు, మార్పు అవసరం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు. Bookmark the permalink.