మంచు మనోజ్

ప్రస్తుతం మన తెలుగు సినిమా పరిశ్రమ అంతా కొత్త కొత్త హిరోలతో కళ కళ లాడుతుంది. కొత్త హీరోలలో ఎక్కువ శాతం ప్రముఖ నిర్మాతల లేదా ప్రముఖ దర్శకుల లేదా ప్రముఖ నటుల వారసులే. వెనుక ఎంత బలం, బ్యాగ్రౌండ్ వున్నా నిలబడటం(ప్రేక్షకాదరణ పొందడం) అంత సామాన్య విషయమేమీ కాదు. వారి దగ్గర డబ్బు బలం వుంది కాబట్టి, సినిమాల మీద సినిమాలు తీస్తూనే వుంటారు. ఆ విధంగా వాళ్ళ ఫేసులు మనకు అలవాటయ్యి, తప్పక చూస్తూ వుండాలి. ప్రతి వారసుడికి ఏదో లోపం వుంది. వారిని స్క్రీన్ మీద మూడు గంటలు పాటు continues గా భరించడం కష్టమే.

నేను చిరంజీవిని లైక్ చెయ్యడానికి కారణం “One Man Show”. ఆయన ప్రతి సినిమా చిరంజీవి సినిమాలా వుంటుంది తప్ప, no one can dominate him. తెరవెనుక కష్టపడి పని చేసిన టెక్నీషియన్స్ ను చిరంజీవి తన ఫెరఫార్మన్స్ తో డామినేట్ చేస్తాడు. సచిన్ సెంచరీ కొట్టి ఇండియా గెలిస్తే ఎంత ఆనందం పొందుతానో, చిరంజీవి సినిమా చూస్తున్నప్పుడు అంతే ఆనందాన్ని పొందుతాను. పవన్ కళ్యాణ్ చేసేవి తక్కువ సినిమాలే అయినా అదే వారసత్వాన్ని తమ్ముడు సినిమాతో మొదలు పెట్టాడు. ఈ సినిమాతో పవన్ కళ్యాన్ ను నటుడిగా ఇష్ట పడటం స్టార్ట్ చేసాను.

నేను ఇష్టపడే “One Man Show”, నాకు ముగ్గురిలో బాగా కనిపిస్తుంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ మరియు అల్లరి నరేష్. అల్లు అర్జున్, అల్లరి నరేష్ లకు నటనపై పట్టు వచ్చేసింది మరియు వాళ్ళకంటూ ఒక ఇమేజ్, బిజినెస్ క్రియేట్ చేసేసుకున్నారు. మంచు మనోజ్ చేస్తున్న ప్రతి ప్రయత్నం నాకు నచ్చుతుంది. అందరికి నచ్చే , తనకు ప్రత్యేక ఇమేజ్ వచ్చే పాత్ర త్వరలోనే సాధిస్తాడని ఆశీస్తున్నాను.

ప్రేక్షకులు ఆదరించాలంటే హిరో ఫేసు, బాడీ లాంగ్వేజ్ కి ప్రేక్షకులకు అలవాటు అవ్వాలి. ఒక హిట్ సినిమా పడితే చాలు, మంచు మనోజ్ ఆ విజయాన్ని నిలుపుకుంటాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.