బిందాస్ Xవ్యూ

సినిమా లో ప్రత్యేకత ఏమిటి?
ప్రేక్షకుల పరంగా ఆలోచిస్తే, ఏమీ లేదు. మనోజ్ పరంగా ఒక మంచి ప్రయత్నం. ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే, మనోజ్ తన పాత్ర కు 100% న్యాయం చేసాడు. అల్లు అర్జున్ బాటలో ఎనర్జిటిక్ రోల్స్ ఎంచుకోవడం బావుంది అనిపించింది.

సినిమాలో కొత్తదనం ఏమైనా వుందా ?
కొత్తదనం వుంది. కాని పాతదనం డామినేట్ చేసింది.

హైలట్స్ ఏమిటి ?
1) ఫస్ట్ ఫైట్ డిజైనింగ్ కేక. సినిమా అంటే ప్రేక్షకుడిని ఎక్కడికో తీసుకోని వెళ్ళాలి. నిదానంగా అది అంతా భ్రమ నాయన, నిజం ఇది అని స్మూత్ ఫినిషింగ్ ఇవ్వాలి. అటువంటి రెండు hero introduction ఫైట్స్(గ్యాంగ్ లీడర్, వెంకీ) అంటే నాకు పిచ్చ ఇష్టం. అది కోవలోకి ఈ ఫైట్ కూడా చేరింది.

2) మనోజ్ చేసిన ఫీట్స్ అన్నీ కేక.

సినిమా చూడవచ్చా ?
ఈ ప్రశ్నకు నా జవాబు అడిగే వాళ్ళను బట్టి మారుతూ వుంటుంది. ఏ సినిమాకైనా, ఎవరైనా ఈ ప్రశ్నకు జనరల్ గా జవాబు చెప్పడం కష్టమైన పని. రివ్యూలో ఈ ప్రశ్న లేకపోతే మన అభిప్రాయాన్ని పూర్తిగా వెలిబుచ్చినట్టు కాదు.అందుకే జవాబు స్కిప్ చెయ్యకుండా ఇక్కడ వ్రాస్తున్నాను. అర్ధం చేసుకో గల్గితే నేను ధన్యుడిని.

తెలుగు సినిమా పరిశ్రమ అంతా వారసులమయం. ఒక సినిమా పిచ్చోడిగా ఆర్య2 నచ్చాలంటే అల్లు అర్జున్ పై మంచి అభిప్రాయం వుండాలి. అప్పుడే ఈ సినిమా కోసం సుకుమార్ పడిన కష్టం గుర్తించ వచ్చు. ఆర్య2 పూర్తిగా గా కొత్తదనం గల్గిన సినిమా. బిందాస్ కొత్తదనాన్ని పాతదనంతో మిక్స్ చేసిన సినిమా. మనోజ్ మీద మంచి అబిప్రాయం వుంటే కచ్చితంగా చూడవచ్చు. సినిమా డిస్సపాయింట్ చెయ్యదు. ఇటువంటి ప్రయత్నాలే చేస్తూ, పాతదనం లేకుండా చూసుకుంటే మనోజ్ త్వరలోనే హిట్ కోడతాడనిపిస్తుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, Xclusive. Bookmark the permalink.