సినిమా చూడవచ్చా ?

కొత్త సినిమా డిస్కషన్స్ వచ్చినపుడు, సినిమా చూసినవారినెవరినైనా నేను అడిగే ప్రశ్న. ” సినిమా చూడవచ్చా ?”. కాబట్టి నా సినిమా రివ్యూస్ లో, ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ వుంటాను.

ఈ ప్రశ్నకు నా జవాబు అడిగే వాళ్ళను బట్టి మారుతూ వుంటుంది. ఏ సినిమాకైనా, ఎవరైనా ఈ ప్రశ్నకు జనరల్ గా జవాబు చెప్పడం కష్టమైన పని. రివ్యూలో ఈ ప్రశ్న లేకపోతే మన అభిప్రాయాన్ని పూర్తిగా వెలిబుచ్చినట్టు కాదు.

ఇండస్ట్రీ ప్లాఫ్ మెగా సినిమా “జానీ” నచ్చిన వాళ్ళు వున్నారు. 78 సంవత్సరాల తెలుగు సినిమా పరిశ్రమలో, అసలైన ఇండస్ట్రీ హిట్ అంటే ఇది అని చెప్పిన సినిమా “మగధీర” నచ్చని వాళ్ళు వున్నారు.

జానీ చూడటం వేస్ట్, మగధీర తప్పకుండా చూడవచ్చు అంటే పైన చెప్పబడిన వాళ్ళు ఒప్పుకోరు.

అందుకే ” సినిమా చూడవచ్చా ?” అనే ప్రశ్నకు నా జవాబులో if else conditions విస్మరించకూడదు.

సినిమా చూడాలా వద్దా అనేది మన నిర్ణయమే అవ్వాలి తప్ప వేరే వారిది కాకూడదు. వ్యక్తిగత రివ్యూలు చదువుతున్నప్పుడు , ఆ వ్యక్తులపై పూర్తీ అవగహన వుండాలి. తెలుగు సినిమా వ్యక్తిగత రివ్యూలు అయితే ఇంకా ఎక్కువ వుండాలి. వ్రాసిన వాళ్ళు ఎవరి అభిమానో తెలిసుండాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.