బ్రోకర్

బ్రోకర్ అంటే చిన్నచూపు. ఆకశ్మతుగా బ్రోకర్ అంటే చిన్నచూపు అని ఎందుకు మొదలు పెట్టాను అంటే, ఇప్పుడు ఒక చిన్న బ్రోకర్ పని చేస్తున్నాను. నిజమైన బ్రోకర్లు డబ్బులు తప్ప ఏమి ఆశిస్తారో తెలియదు కాని, నేను ఇప్పుడు చేసే బ్రోకరతనం వలన ఆశించేది ఏమీ లేదు. ఏమిటా బ్రోకరతనం అంటే గొప్పగా చెప్పుకోదగినది కాదు మరియు ఆత్మగౌరవ సమస్య.

నేను చేసే బ్రోకరతనం పక్కన పెట్టి

బ్రోకర్ అంటే ఏమిటి ? మధ్యవ్యర్తా ? .. ఇది చాలా కష్టమైన పని. నాకు చాలా అయిష్ట మైన పని కూడా. ఇద్దరినీ సవరదీస్తూ వుండాలి. ఒకసారి ఒక చిన్న గొడవలో మధ్యవర్తత్వం వహించానులెండి. అప్పుడు తెలిసింది, ఎంత నరకమో. నాకేమో వీడి దగ్గర వాడి గురుంచి తక్కువగా , వాడి దగ్గర వీడి గురుంచి తక్కువగా మాట్లాడటం రాదు. నేను చేసిన మధ్యవర్తత్వంలో ఒకాయన తన తప్పు ఒప్పుకున్నాడు. డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి తాను ఏమి చేయడానికి అయినా రెడీగా వున్నాడు. ఇంకోయాన ఒప్పుకోడే. ఆ తప్పులనే తిరగ త్రవ్వి, వాయిస్ రైజ్ చేసి నా బుర్ర ఫ్రై చేసేసాడు. అంతా విని ఇప్పుడు ఏమి చేద్దాం అంటే మళ్లి మొదలికి వచ్చేది. అప్పుడు డిసైడ్ అయ్యాను, పొరబాటున కూడా మధ్యవర్తత్వం పుచ్చుకోకూడదు అని.

చాలా రోజుల తర్వాత, ఈసారి గొడవ కాదు. పర్సనల్ గా గుల ఎక్కువై ఒక చిన్న కాంప్రమైజ్ ఇష్యూ నెత్తి మీద వేసుకున్నాను. దీని వలన ఎవరికీ లాభం అంటే నా దగ్గర సమాధానం లేదు. నాకైతే అసలు లాభం లేదు. గుల అనే పదానికి నిర్వచనం ఈ కాంప్రమైజ్ కోసం నా ఈ ప్రయత్నం. సక్సస్ కావాలని ఆశీస్తూ ..

సక్సస్ అయితే మరో పోస్ట్ లో ఈ పోస్ట్ ను రిఫర్ చేస్తా .. లేదంటే పనికిమాలిన బ్రోకర్ పనులకు ఫుల్ స్టాఫ్ పెడతా.

విడి విడిగా మొదట విడత చర్చలు చేసాను. రెండు పార్టీలు కాంప్రమైజ్ కు అనుకూలంగానే మాట్లాడారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక సైడు డైరక్ట్ గా చెప్పేయమంటుంది. అంత డైరక్ట్ గా చేప్పేసేది అయితే, మధ్యలో నా బ్రోకరతనం ఎందుకు చెప్పండి ? I am not having any fun, but నా ప్రయత్నం సక్సస్ అయితే I will be happy.

(సశేషం)

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.

One Response to బ్రోకర్

  1. chavakiran అంటున్నారు:

    మా ఊర్లో ఒక పరమ బూతు సామెత ఉంది మద్యనున్న వాడిమీద ఛ)

వ్యాఖ్యలను మూసివేసారు.