శ్రీకృష్ణ కమిటీ అవుట్ పుట్

శ్రీకృష్ణ కమిటీ ఎందుకు నియమించారో నాకు తెలియదు. నాకు అన్నీ ప్రశ్నలే.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పక్రియ మొదలు పెడతాం అని హోం మంత్రి ప్రకటన చేసి, మళ్లి ఈ కమిటీ ఏమిటో ?
ఈ కమిటీ ఏమి నిర్ణయిస్తుంది ? కమిటీ నిర్ణయాన్ని కచ్చితంగా పాటిస్తారా ?

“ప్రత్యేక తెలంగాణ అవసరమా ?” అనే కోణంలో కమిటీ పని చేస్తుందా ? లేక “ప్రజలు విడిపోవాలి అనుకుంటున్నారా ? లేదా? ” అని దర్యాప్తు చేస్తుందా ?

నా ఉద్దేశం “ప్రత్యేక తెలంగాణ అవసరమా ?” అనే కోణంలో పని చేసి అవసరమా లేదా అని తేల్చి పారేయాలి. కాని అలా జరగదు. సాగదీయడమే లక్ష్యంగా సాగుతాది అని అనుమానం.

“ప్రజలు విడిపోవాలి అనుకుంటున్నారా ? లేదా? ” అని తెలుసుకుంటే: నా అంచానా ప్రకారం ఈ రిజల్ట్స్ రావాలి.
ఆంధ్ర ప్రజలు: విడిపోవాలి. మాకు నష్టం ఏమీ లేదు.
తెలంగాణ ప్రజలు: హైదరాబాద్ మాదే కాబట్టి విడిపోవాలి.
రాయలసీమ ప్రజలు: విడిపోవాలి. మాకు మంచి ప్యాకేజి ఇవ్వాలి.

హైదరాబాద్ పై మమకారం చంపుకోలేని సీమాంధ్ర ప్రజలు: కలిసుండాలి.

My Opinion:
తొందరగా విడగొట్టి విజయవాడనో గుంటూరునో రాజధానిగా చేసేస్తే, కోస్తాంధ్ర అభివృద్ధి చూడాలని వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Xclusive. Bookmark the permalink.