అల్లు శిరీష్ పై రూమర్స్

అందరినీ ఆకట్టుకునేవి రూమర్స్. మనకు ఇష్టమైన వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం కాదు అని ignore చేస్తూ, ఇష్టం లేని వాళ్ళపై వచ్చే రూమర్స్ నిజం అన్నట్టుగా ప్రచారం చెయ్యడం మనలో వుండే సహజమైన శాడిజం. వాటి క్రేజ్ ను ఎవరూ కిల్ చెయ్యలేరు.

http://www.a2zdreams.com పుట్టడానికి ఒక బలమైన కారణం వుంది. ఆ సైట్ గురుంచి ఎన్నో కలలు కంటూ వుండే వాడిని. అందులో ఒక సెక్షన్ రూమర్స్. ఈ సైట్ లో రూమర్స్ కు ఒక ప్రత్యేకత వుండేలా డిజైన్ చేసాను. అది ఒక కలగానే మిగిలి పోయింది.

ఒక జర్నలిస్టుకు తన బ్లాగులో(click here) రూమర్స్ క్రియేట్ చెయ్యడం ఒక హాబీ. ఆ జర్నలిస్టు ఆర్య-2 షాపింగ్ లోనో షూటింగ్ లోనో, అల్లు శిరీష్ ఆర్య-2 కు సంబందించిన కాస్ట్యుమ్స్ కాజేసాడని ప్రచారం చేసింది. ఇప్పుడు అల్లు శిరీష్ వివాహం ఒక మంత్రి కూతురితో అని ప్రచారం స్టార్ట్ చేసింది. అల్లు శిరీష్ కూడా బ్లాగు మెయింటెన్ చేస్తుండటంతో, ఘాటుగా స్పందించాడు. బాగుంది. (click here)

ఈ రూమర్స్ కు నాకు సంబంధం ఏమిటి ? అనుకుంటే ఇది చదవండి:
పవన్ కళ్యాన్ అంటే నాకు అభిమానం. అభిమానానికి కారాణాలు చాలా వున్నాయి. ప్రధాన కారణం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి(click here). పవన్ కళ్యాన్ కు ఒక అభిమానిగా అతనిపై క్రియేట్ చేయబడ్డ రూమర్స్ కు సమాధానం చెప్పాలని అనుకుంటూ వుంటా. నాకెందుకు ఆ గుల అంటే, ఏ హిరో అభిమానిని అడిగినా సమాధానం దొరుకుతుంది. దాని కోసం రీసెంట్ గా పవన్ కళ్యాన్ కు ఒక అప్లికేషన్ కూడా ఇచ్చాను. రూమర్స్ ను కేర్ చెయ్యని పవన్ కళ్యాన్ రిజెక్ట్ చెయ్యడం కూడా జరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నం చెయ్యాలని వున్నా, ఇప్పుడు నాకున్న ఖాళీ సమయం వేరే వాటిపై కేటాయించడం వలన ఆ ప్రయత్నాన్ని హోల్డ్ లో పెట్టాను. ఎప్పుడు అనేది చెప్పలేను కాని, ప్రయత్నం మాత్రం చేస్తాను.

అల్లు శిరీష్ పెళ్లిపై వచ్చిన రూమర్స్ వలన నష్టం లేదు కాని, కాస్ట్యుమ్స్ కాజేసాడని రూమర్స్ ప్రచారం చెయ్యడం మాత్రం ఖండించ వలసిందే. ఖండించక పొతే అవే నిజం అయిపోతాయి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.