ఏక్ నిరంజన్ xవ్యూ

ఈ సినిమాకు రివ్యూ అవసరమా ?
ఈ మధ్య నా రివ్యూస్ లో నా సెల్ఫ్ డబ్బా కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. సెల్ఫ్ డబ్బా అంటే నా ఇష్టాలు/కష్టాలు. ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు చాలా అవసరం అనిపించింది. సినిమా బలవంతంగా ఈ వికేండే చూసాను.

సినిమా నచ్చిందా ?
సినిమా ఘోరంగా వుందని రివ్యూస్ చదివి చూడటం వలనేమో. నాకు నచ్చింది అని చెప్పలేను కాని, ఘోరంగా అయితే లేదు.

ప్రభాస్ ఎలా చేసాడు ?
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో ఒక కొత్త స్టైల్ ఏర్పరుచు కున్నాడు. ఈ సినిమాలో ఇంకో స్టైల్ తో వస్తాడు అని ఎక్సపెట్ చెయ్యడం అభిమానులు తప్పు తప్ప, ప్రభాస్ తప్పు కాని పూరీ తప్పు కానీ కాదు. he did very fine job.

ఈ సినిమాను పూరీ ఓవర్ కన్ఫిడేన్స్ తో తీసాడు అన్నారు. నీకు ఎలా అనిపించింది ?
ఓవర్ కన్ఫిడేన్స్ అనలేను. మనిషి మీద చిన్న ఒత్తిడి వుండాలి. అప్పుడే మంచి అవుట్ పుట్ వస్తుంది. ఒత్తిడి లేకుండా చేసినా సినిమాలా అనిపించింది.

కథ ఏమిటి ?
పూరీ కథలకు నేను అభిమానిని. I liked the story.

హిరోయిన్ పెద్ద మైనస్ అన్నారు. నిజమేనా ?
పెద్ద హీరోల సినిమాలలో హిరో యిన్లకు అంత ప్రాముఖ్యత వుంటుం దని నేననుకొను.సినిమా రిలీజ్ కు ముందు ఆ హిరోయిన్ కొన్ని ఫంక్షన్స్ కు అటెండ్ అవ్వడం, ఆ ఫోటులు ఘోరాతి ఘోరంగా వుండటం జరిగింది. వాటి ద్వారా ప్రభాస్ అభిమానులలో చాలా నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. ఆ ప్రభావంతో చూడటం వలన ఘోరం అనిపించి వుండవచ్చు. స్ర్కీన్ మీద ఫంక్షన్స్ ఫోటులలో ఉన్నంత ఘోరంగా అయితే లేదు.

సినిమా ఫ్లాఫ్ అవ్వడానికి కారణాలు ఏమనుకుంటున్నావు?
బారీ అంచనాలు. పూరి మీద ఒత్తిడి లేకపోవడం. అభిమానులు ఆశించిన కొత్తదనం ప్రభాస్ ఇవ్వక పోవడం. రోటీన్ ఫైట్స్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in తెలుగుసినిమా రివ్యూస్, సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.