తెలుగు సినిమా

నాకు సినిమాలంటే ఇష్టం/పిచ్చి కలగడానికి కారణం చిరంజీవి. చిరంజీవి సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతోనే వేరే సినిమాలు కూడా చూసే వాడిని అంటే అతిశాయోక్తి కాదు. సినిమాలంటే ఇష్టం/పిచ్చి ఏ రేంజ్ లో పెరిగింది అంటే “ఈ సీను ఇలా ఎందుకు వుంది ?”, “ఆ సీను అలా ఎందుకు లేదు ?”, “అన్నీ బాగున్నాయి, ఈ ఒక్క సీను వలన మొత్తం సినిమా ఫీల్ అంతా పోయింది”, “సినిమా బాగుంది, కాని ఆడదు”, “ఈ సినిమా wrong టైంలో రిలీజ్ అయ్యింది” , “చాలా కష్ట పడ్డారు”, అని ఆలోచించడం మొదలయ్యింది. సినిమా ఎంజాయ్ చెయ్యాలి కాని ఇలా చూడటం ఏమిటి అని అప్పుడప్పుడు బాద కూడా వేస్తూ వుంటుంది.

ఇప్పుడు కొత్త స్టేజ్ లో అడుగు పెట్టాను. సినిమా చూస్తే మూడు గంటలు టైం వేస్ట్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. గత రెండు/మూడు నెలలుగా నేను చూసిన సినిమాలు అన్నీ కూడా బలవంతంగా చూసినవే. దీని అర్ధం సినిమాలంటే ఇష్టం/పిచ్చి పోయింది అని కాదు. నేను కూడా సినిమా మేకింగ్ లో పాల్గోనాలన్న పిచ్చి ముదిరింది అన్నమాట. even బ్లాగు కూడా బలవంతంగానే వ్రాస్తున్నాను అన్న ఫీలింగ్ వుంది. మా ఫ్రెండ్ ఇండస్ట్రీ లో వుండటం వలన సాధ్యం అయ్యే పని అనే అనిపిస్తుంది. భగవంతుడు ఎలా నడిపిస్తాడో చూడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.