ప్రస్తుతం నా ఇంటరెస్ట్స్

ప్రాణ స్నేహితులను నేను చూడలేదు. నూటికో కోటికో వుంటారేమో.

నాకు చాలా మంది స్నేహితులు వున్నారు. అందులో ఒక స్నేహితుడి దగ్గర తీర్చు కోలేని సహాయం కూడా పొందాను. అతడికి ఎటువంటి బాదలు రాకూడదని మనస్పూర్తిగా కొరుకుంటూ వుంటాను. నిస్సాహయ స్థితిలో అడగకూడని సహాయం నేను అడగడం. అవసరానికి ఎవరికైనా, ఏమైనా చేస్తాను అనే ఆ స్నేహితుడి సిద్దాంతం , నన్ను అతనికి పర్మనెంట్ ఋణగ్రస్తుడిని చేసేసాయి. అతను నాకు ఫ్యామిలీ మెంబర్ తో సమానం . అతనిని నేను నా ప్రాణ స్నేహితుడు అని మాత్రమే అనలేను. నా పొజిషన్ లో ఎవరు వున్నా అతను సహాయం చేసేవాడు.

నాకు స్నేహితులు తప్ప, ప్రాణ స్నేహితులు లేరు. నా స్నేహితులు ఎవరితోనూ నేను రెగ్యులర్ గా టచ్ లో లేను. ఏదైనా అవసరం అయితే మాత్రం వారిని contact చెయ్యడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వ్యక్తిగత బాద్యతలు, ఇంటరెస్ట్ ల కారణం గానే వాళ్ళతో టచ్ లో లేను తప్ప, వారికి దూరంగా వుండాలని మాత్రం కాదు.

నాతో స్నేహం చెయ్యాలంటే 1) సినిమాలంటే పిచ్చి వుండాలి. 2) చిరంజీవి అంటే అభిమానం వుంటే ఇంకా మంచిది. చిరంజీవిని ద్వేషించే వాళ్ళను నేను దూరం పెట్టాను కాని, ఏదో గ్యాప్ మెయింటెన్ చెయ్యవలసి వస్తాది.

నాకు కల్పించుకొని మాట్లాడటం అంటే చిరాకు. అందుకనే నేను ఎక్కువ టైం మౌనం గానే వుంటాను. సినిమాలంటే పిచ్చి , చిరంజీవి అంటే అభిమానం వుంటే ఆటోమేటిక్ గా నాకు వాళ్ళతో మాట్లాడటానికి కొన్ని విషయాలు వుంటాయి.

“ఎక్కడ ఆస్తులు కొన్నావు ?”, “బంగారం రేటు పెరుగుతుంది”, “ఆ టెక్నాలజీలో బిల్లింగ్ బాగుంది”, ” ఆ షేర్స్ రేట్లు బాగా పెరిగాయి”, “ఒబామా ఈ రూల్స్ పెట్టాడు” అటువంటి మాటలు వింటుంటే నాకు కాలి పోతావుంటాది. అందుకే నాకు ఫంక్షన్స్ అంటే ఆసక్తి వుండదు.

ప్రస్తుతం నా ఇంటరెస్ట్స్, నా దృష్టంతా “సినిమా మేకింగ్(కథ, స్క్రీ న్ ప్లే)”, “learning linux” మీదే వుంది. వీటికి తోడు ఎక్కడ ప్రెజెంట్ లోకజ్ఞానం కోల్పోతాను అనే భయంతో రాష్ట్ర రాజకీయాలు, సినిమాలు ఫాలో అవ్వక తప్పడం లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.