మా సినిమా ..

ఎట్టకేలకు మా ఫ్రెండ్ కథ తయారు చెయ్యడం మొదలయ్యింది ..

కథ ఏమిటి ?
పూరీ జగన్నాథ్ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ కథ మరో చరిత్రలో ఒక సీను నుంచి మొదలయ్యింది అని చెప్పాడు. అదే విధంగా మా ఫ్రెండ్ కథ మరో సినిమా నుంచి పుట్టిందే.

మా ఫ్రెండ్ కు స్పూర్తినిచ్చిన సీన్ ఆదారంగా ఎన్నో డైరక్షన్స్ లో ఎన్నో కథలు తయారు చేయవచ్చు. నేనొకటి సజెస్ట్ చేసాను. నాది మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకని చేసిన సజెషన్. కానీ వాడు మరో విధంగా ఆలోచించి యూత్ ను టార్గెట్ చేస్తూ కథ అల్లాడు. కథనం మీద వర్క్ చేస్తున్నాడు. భగవంతుడి దయవల్ల ఈ కథనం అనుకున్నట్టుగా తయారవుతే బ్రేక్ వచ్చినట్టే. ఇది ఒక ప్రేమ కథ.

ప్రేమ కథ అవ్వడం వలన ఇది కథ అని చెప్పడానికి ఎమీ లేదు. కథనం తోనే ఆకట్టు కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హిరో వ్యక్తిత్వమే ఈ కథనానికి కీలకం. అటువంటి హిరో వ్యక్తిత్వంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు ఎమీ రాలేదు.

ఈ వర్క్ అంతా ఒక నిర్మాత ప్రోత్సాహంతోనే ఉషారుగా చేస్తున్నాడు.

హిరోకి చెప్పేంత కథనం రెడీ అయిపోయింది. ఈ నెలలో హీరోకు వినిపించాలనుకున్న మా లక్ష్యాన్ని మార్చుకున్నాము. మాకు స్పూర్తినిచ్చిన వ్యక్తినే మొదటి ప్రేక్షకుడిగా ఎంచుకుని అతని అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మే 1 కల్లా చేస్తాను రెడీ అన్నాడు. జూలై 1 ఈజ్ మై టార్గెట్. చిన్న చిన్న సలహాలు ఇవ్వడానికి నెక్స్ట్ month నుంచి నేను కూడా చర్చలలో పాల్గొంటాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.