a2zdreams.com

ఒకప్పుడు pawanfans.com సైటులో మోస్ట్ యాక్టివ్ మెంబర్నీ. సైటు నేనే రిజిస్టర్ చెయ్యడం వలన, సైటు నాదే అనే పేరుతో పాటు, పవన్ కళ్యాన్ న్యూస్ ఏమీ లేక పోయినా సైటును ఏదో విధంగా యాక్టివ్ గా వుంచే బాద్యత వుండేది. పేరుకి పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ సైటు అయినా, అందరి మెగా హీరోల న్యూస్ పెట్టడానికి కారణం యాక్టివ్ గా వుంచడానికే. exclusive పవన్ కళ్యాన్ కాకుండా వేరే న్యూస్లు ఎందుకు పెడుతున్నారు అనే విమర్శలు బాగా వినిపించేయి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే బన్నీ విషయంలో బాగా వినిపించేవి. pawanfans.com is not a official site. తమ అభిమానాన్ని చాటు కోవడానికి నలుగురు మెగా ఫ్యాన్స్ రన్ చేసే సైటు. “exclusive news లతో పాటు గాసిప్స్ కు సమాధానం గా వుండాలి.” అనేది నా అభిప్రాయం.

“నా లక్ష్యం డైలీ విజిటర్స్ ను పెంచాలి. వున్న విజిటర్స్ ను లూజ్ అవ్వకూడదు.” అని కూడా వుండేది. దాని కోసం డిస్కషన్స్ బోర్డ్ పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. “డిస్కషన్స్ బోర్డ్ అంటే మన హీరోలను పొగడం మాట అలా వుంచి పక్క హీరోలను తిట్టుకోవడమే సరిపోతాది.” అనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను అక్కడితో ఆపేశాం.

మెగా హీరోలు మాత్రమే హీరోలు కాదు. మనకు చాలా మంది హీరోలు వున్నారు. నేను ఇష్టపడే హీరోల సంఖ్య తక్కువేమీ లేదు. వారి గురుంచి నా బ్లాగులో ఎలా వ్రాస్తున్నానో a2z.pawanfans.com వ్రాయాలని ప్రతిపాదించాను. “డిస్కషన్స్ బోర్డ్ పెట్టి వేరే హీరోల ను తిట్టడం సరైనదే కాని, ఒక ఫ్యాన్స్ సైటులో వేరే హీరోలను పొగడటం మాత్రం చెయ్యకూడదు” అని ఫీడ్ బ్యాక్ రావడంతో a2z.pawanfans.com ప్లేసులో a2zdreams.com పుట్టింది.

వెబ్ టెక్నాలజీలో నాకు నాలెడ్జ్ లేకపోవడం మూలానా a2zdreams.com ఒక్క మెయిన్ పేజ్ తో ఆగిపోయింది.

మగధీర కోసం ఎలా ఆర్టికల్స్ క్రియేట్ చేసానో, ప్రతి తెలుగు సినిమా కు అలా చెయ్యాలన్నదే a2zdreams.com ముఖ్య లక్ష్యం.

మెగా సినిమా “వరుడు” సినిమాకు చేద్దాం అంటేనే నాకు ఉత్సాహం రావడం లేదు, ఇంకా వేరే సినిమాలకు ఏమి చెయ్యగలను ? .. a2zdreams.com ముందుకు సాగక పోవడానికి ఇది కూడా ఒక కారణం.

ఇప్పుడు pawanfans.com ఎవరు మెయింటేన్ చేస్తున్నారు ?

నా ఆలోచనలో మార్పు వుండటం లేదు. నా అద్ద్వర్యంలో pawanfans.com హోం పేజి లుక్ లో కాని, అందులో వచ్చే cut&paste న్యూస్ లో కాని మార్పు వుండటం లేదు. అందుకనే pawanfans.com ను అప్ డేట్ చేసే బాద్యతను ఒక ఉత్శాహవంతుడికి అప్పజెప్పాను. now pawanfans.com is completely under him. పవన్ కళ్యాన్ కు ఒక అప్లికేషన్ ఇచ్చాను. అది accept చేసిన రోజు, pawanfans.com ను పవన్ కళ్యాన్ కు మాత్రమే exclusive చెయ్యాలని వుంది.

ఇంకా a2zdreams.com ఎందుకు ?

సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, నాకు నా ఈ బ్లాగు చాలు. a2zdreams.com ను మెయింటెన్ చేసే ఓపిక లేదు. అది అలా వుండటం వలన నష్టం లేదు. It is my Home Page.

pawanfans.com ను పవన్ కళ్యాన్ కు exclusive చేస్తే, మెగా హిరోలందరి న్యూస్ jaichiranjeeva.comలో కవర్ చెయ్యాలని ప్లాన్.

నేను pawanfans.com మెయింటెన్ చేసే టైంలో నాకిష్టమైన సెక్షన్ ఫోటో గ్యాలరీ. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన exlusive wallpapers, logos, వుండేవి. నేను బయట చేయించిన exlusive పోస్టర్స్, wallpapers, logos కుడా వుండేవి. I am missing those moments and I wanted do that it in jaichiranjeeva.com. నాకు కావలసిన విధంగా గ్యాలరీ సెటప్ చెయ్యడం, నా వల్ల కావడం లేదు. drupal నేర్చుకోవడం స్టార్ట్ చేసాను.నా drupal experiments jaichiranjeeva.comలో చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో కూడా వున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in a2z, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.