నిజాయితీ అంటే YES or NO. there is no in between

ఒకసారి నా నిజ జీవితంలో ఫేస్ టు ఫేస్ జరిగిన సంఘటన:

నాకంటే పెద్దాయన. నా కంటే చదువుకున్న వ్యక్తి. అండ్ సో ఆన్ ..

ఆయన దగ్గరకు ఒక రిక్వెష్ట్ తో వెళ్లాను. ఆయన వాదనలో “మీరు చెప్పే కారణంలో నిజాయితీ లేదు” అంటూ నా రిక్వెష్ట్ ను పూర్తిగా తిరస్కరించాడు.

నేను ఆయనకు చెప్పేది నిజం. దానికి ఒరిజినల్ ఫ్రూఫ్స్ చూపించాను. అవి క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు అంటాడు. మరి మీరు ఎందుకు ఫ్రూఫ్స్ కావాలని అడిగారు అంటే అతని దగ్గర సమాధానం లేదు.

మళ్లీ ఆయనే ఇంకో 100% నిజాయితీ కేసును కూడా accept చెయ్యలేదు. మీది accept చెయ్యడం impossible అని చెప్పేసాడు.

ఆయన 100% నిజాయితీ అనగానే నాకు చిర్రెత్తుకు వచ్చింది. “ఒక వున్నత స్థానం లో వున్నారు. కాని మీకు ఆలోచనా జ్ఞానం లేదు.” అని ఫుల్ ఫైర్ అయిపోయాను.

నిజాయితీ కి % ఏమిటి ? నిజాయితీ అంటే YES or NO.

ఇక్కడ నా లాజిక్ ఏమిటంటే, వంద ‘and కండిషనల్ స్టేట్ మెంట్స్’ వున్నాయి అనుకుందాం. అందులో ఏ ఒక్కటి false అయినా మొత్తం కండిషన్ అంతా false క్రిందే లెక్క. అదే విధంగా నిజాయితీ విషయంలో ఫైనల్ గా TRUE or FALSE. there is no in between.

అందుకే నువ్వు నిజాయితీపరుడివా అని నన్ను ఎవరైనా అడిగితే, వెంటనే “కాదు” అనే సమాధానం చెపుతాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.