లక్ష్యం

కారణాలు ఆలోచించే ఓపిక ప్రస్తుతం లేదు, కాని గత పదేళ్లుగా ఏమీ కొత్తవి నేర్చుకోలేదు. వర్క్లో నాకు ఇచ్చిన పని చెయ్యడమే. పదేళ్లు ఒకే ప్రాజెక్ట్ లో పని చెయ్యడం వలన బయట ప్రపంచం కూడా తెలియలేదు. నేను చేసే వర్క్లో కూడా నాకు సంబంధం లేని పని గురుంచి అసలు పట్టించుకునే వాడిని కాదు. ఆ విధంగా వర్క్ లో ఏమి అవసరం, ఎలా చేస్తారు అనే దానిపై మంచి అవగాహన అయితే వచ్చింది కాని, టెక్నికల్ గా ఏమీ నేర్చుకోలేదు.

అనుభవం వున్న ప్రాజెక్ట్ వదిలెయ్యడం వలన, కొత్త లోకంలోకి వచ్చాను. I became a beginner. బిజినెస్ తెలిస్తేనే ఇక్కడ రాజు అని తెలిసింది. దానికి తోడు కొత్త టెక్నాలాజిస్ తెలియక పోవడం, మేనేజ్ మెంట్ సైడు ఇంటరెస్ట్ లేకపోవడం, గత పదేళ్ళలో నేను మిస్ అయిన టెక్నికల్ అప్ డేట్స్ తెలుస్తున్నాయి. నేర్చుకోవలసిన సమయం ఇది. దానికి తోడు నాకు నేర్చుకోవడం ఇంటరెస్ట్. ఇంటర్నెట్ ద్వారా సెల్ఫ్ గా నేచుకునే అవకాశం. అందుకే మొదటగా బేసిక్స్ తో స్టార్ట్ చేసాను. ముందుగా బేసిక్స్ లో మాస్టర్ అయితే, జాబ్/కెరీర్ ఓరియంటడ్ టెక్నాలజీ నేర్చుకొవడం పెద్ద విషయం కాదు. అందుకే ఈ క్రింది వాటిపై పూర్తీ అవగాహన తెచ్చుకునే ప్రయత్నంలో వున్నాను.

1) linux
2) core java
3) xml

నిజానికి నాకు system programming అంటే ఇష్టం. ఇప్పుడు ఆ ఓపిక వుందని నేను అనుకోవడం లేదు. పై మూడు పై పట్టు సాధించాక ఎటు వెళ్ళాలో ఆలోచిస్తా. virtualbox చూస్తుంటే, దాని క్రియేటర్స్ , ప్రోగ్రామర్స్ లో నేను ఒకడిని అయ్యివుంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. అదృష్టమో/దురదృష్టమో virtualbox లాంటి అప్లికేషన్స్ క్రియేటర్స్ గా కాకుండా వాటి యూజర్స్ గానే పరిమితం కావలసి వచ్చింది.

నా జీవిత గమ్యం “మరణం” అని తెలుసుకున్నాను. కాని, ఎంత ఆలోచించినా నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ప్రస్తుత లక్ష్యం మాత్రం పై బేసిక్స్ లో మాస్టర్ కావడమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.