పవన్ కళ్యాన్ రాజకీయలకు శాశ్వతంగా దూరం

1) నిజాయితీగా పోరాడు. నిజాయితీగా పోరాడితే ఎటువంటి రాతలు/మాటలు మనలను ఏమి చెయ్యలేవు. (like జయ ప్రకాష్ నారాయణ)

2) ఒక రాయి వేస్తే, వంద రాళ్ళు వెయ్యి. ( like జగన్, కె.సి.ఆర్)

రాజకీయాలు మరింత భ్రస్టు పట్టిపోయి నాశనం కావాల్సిందే తప్ప, క్లీన్ అవుతాయి అనుకోవడం భ్రమ. క్లీన్ చేసేస్తాను అనుకోవడం అవివేకం. జయ ప్రకాష్ నారాయణ చేసే ప్రయత్నం వృధా ప్రయత్నమే.

ప్రస్తుతం దమ్ముంటే జగన్, కె.సి.ఆర్ మార్గంలో పయనించాలి.లేదా చంద్రబాబు మాదిరి కుట్రలు చేయగల్గాలి. రాజకీయలలో ఏమి చేసినా తప్పు కాదు. ఇది ప్రజాతీర్పు. ప్రజాభీష్టం. and whatever.

లేని పక్షంలో రాజకీయలకు దూరంగా వుండటం బెటర్.

తెలిసో , తెలియకో చిరంజీవి రాజకీయలలో అడుగు పెట్టి, బయటకు రాలేని ఊబిలో కూరుకుపోయాడు. ఎలా బయటకు వస్తాడో, ఇంకా ఎన్ని ఇబ్బందులు పడతాడో నాకు తెలియదు. ఎలాగు రిటైర్ మెంట్ ఏజే కాబట్టి, పెద్దగా నష్టం ఏమి లేదు.

పవన్ కళ్యాన్ కు అభిమానిగా పవన్ కళ్యాన్ రాజకీయలకు శాశ్వతంగా దూరం వుండాలని, ప్రజాసేవ చెయ్యాలనుకుంటే వేరే మార్గం ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.