ప్రజలు – మీడియా

తెలుగుదేశం మీడియా గురి ఇంకా ప్రజారాజ్యంపై ఎందుకు పెట్టే వుంచిందో నాకు అర్ధం కావడం లేదు. నాకు తెలుసున్న ప్రపంచం చిన్నది. నా పరిధిలో నాలాంటి చిన్న చిన్న అభిమానులు తప్ప చిరంజీవికి ఎవరూ సానుకూలంగా లేరు. నేను కూడా ప్రజారాజ్యంకు ఓటు వెయ్యాలంటే ఆలోచించే పరిస్థితి వుంది. దానికి కారణం లోకల్ నాయకులు లేరు. లోకల్ నాయకులను హ్యాండిల్ చెయ్యడంలో చిరంజీవి పూర్తిగా విఫలం అయ్యాడు.

హైదరాబాద్ లో చిరంజీవి చుట్టూ తప్ప నాకు ఎక్కడా ప్రజారాజ్యం కనిపించడం లేదు. అటువంటి ప్రజారాజ్యంపై తెలుగుదేశం మీడియా ఎందుకు ఫోకస్ చేసిందో వాళ్ళకే తెలియాలి. ప్రజారాజ్యం ప్రజలలో ఎలా వుందో నాకు తెలియదు కాని, తెలుగుదేశం వారికి నిద్ర లేకుండా మాత్రం చేస్తుందని అర్ధం అవుతుంది.

ప్రజలకు ఇంకో మీడియా అవసరం అంటూ ఇక్కడ చదివా. దానికి నా స్పందన.
ప్రజలకు కావలసింది మీడియా కాదు. ప్రజలకు కావలసింది డబ్బు. అది బాబు గ్రహించాడు కాబట్టే నగలు బదిలీ పథకం పెట్టాడు.

ప్రజారాజ్యం పార్టీ రాజకీయ మనుగడ సాగించాలంటే సొంత మీడియా కచ్చితంగా అవసరం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.