అల్లు అర్జున్ గొప్పతనమే

ఆర్య2 100% సుకుమార్ సినిమా. కానీ ఆ సినిమాకు ప్రాణం పోసింది అల్లు అర్జున్. ఈ సినిమాలో అంతేముంది ? అనే వాళ్ళే కాదు, అసలు ఏమీ లేదు అనే వాళ్ళు కూడా చాలా మంది వున్నారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకొకపోవడానికి గల కారణం ఏమిటి అనే దాని మీద రీసెర్చ్ చెయ్యాలి. నాకైతే ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. ఎక్కడా కూడా మోసం చెయ్యకపోవడం ఈ సినిమా ప్రత్యేకతగా అనిపించింది.

అల్లు అర్జున్ ఒక్క ఆర్య2కే కాదు. ఏ సినిమాకైనా అంతే ఎనర్జీ, అంతే కష్టంతో పని చేస్తాడని ఈ రోజు ఫ్రెండ్ చెపుతున్నాడు. వరుడు సినిమాలో అల్లు అర్జున్ ఏ ప్రత్యేకత చూపిస్తాడో, గుణశేఖర్ లో నాకు కనిపించని టాలెంట్ అల్లు అర్జున్ కు ఏమి కనిపించిందో చూడాలి.

వరుడు పాటలు instant హిట్ కాకపోయినా, ఈ సినిమాపై బారీ అంచనాలు వుండటం అల్లు అర్జున్ గొప్పతనమే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.