రాజకీయాలకు గౌరవం impossible

పెద్దాయన: నువ్వు ఎక్కువగా దమ్ము అనే పదం ఎక్కువ వాడుతూ వుంటావు. నీకు దమ్ము వుందా ?
నేను: హా ..హా .. మంచి ప్రశ్న సార్.
నేను: రాజకీయ వ్యాపారం నష్టాలలో వుందట. నిజమేనా ?
పెద్దాయన: ప్రజారాజ్యంకు ఫండ్స్ లేక పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారు. దాని గురించేనా నువ్వు మాట్లాడేది ?
నేను: లోకల్ నాయకులను హ్యాండిల్ చెయ్యడంలో చిరంజీవి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. మాములుగా రూపాయి ఖర్చు పెడితే, పది రుపాయిలు ఆశీస్తారు. రాజకీయ నాయకులు అయితే రూపాయికి వంద రూపాయిలు ఆశీస్తారు.
పెద్దాయన: నేనొకటి, నువ్వొకటి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.
నేను: చాలామంది చిరంజీవి అభిమానులు ఏమి ఆశీంచకుండా, చిరంజీవి పేరు మీద ఎన్నో మంచి పనులు చేసారు. అదే విధంగా రాజకీయ నాయకులు వుంటారనుకోవడం అవివేకం.
పెద్దాయన: అంటే ?
నేను: మనిషి కోరుకునేది గౌరవం. అది తనను అభిమానించే వాళ్లకు ఇవ్వకుండా, స్వార్దపరులకు ఇస్తే ఎలా వుంటుందో చిరంజీవికి అర్ధం కావడం లేదు. అర్ధం కాదు కూడా.
పెద్దాయన: అభిమానులలో స్వార్దపరులు లేరా ? మీలో మీరే కొట్టుకుంటారు కదా ?
నేను: అదే కదా చిరంజీవి బాద్యత. అందరినీ ఒకటి చెయ్యాలి. మన లక్ష్యం ఇది అని చెప్పాలి.
పెద్దాయన: నాకు ఒక్క ముక్క అర్ధం అయితే ఒట్టు.
నేను: అర్ధం చేసుకోవడం కష్టంలెండి. ఇవి గోండి మీరు అడిగిన ప్రశ్నలకు డైరక్ట్ సమాధానాలు.
1) నాకు దమ్ము లేదు. నేను అతి సామాన్యుడిని కాబట్టే, నా ఆవేదనను బ్లాగుతో సరిపెట్టుకుంటున్నాను.
2) ఎవడూ తమ జేబుల్లో డబ్బులు తీసి పార్టీల కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టడు. రాజకీయం అంటే అక్రమ సంపాదనకు రాజమార్గం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు అక్రమ సంపాదన దండిగా వుంది.
3) ప్రజారాజ్యంకు సొంత మీడియా లేదు. పార్టీ ఫండ్ కోసం తీసుకున్న డబ్బులను, టిక్కెట్లు అమ్ముకున్నారు అనే విధంగా ప్రత్యర్దులు క్రియేట్ చేసినా, ఖండించ లేని పార్టీ. ఆ ప్రచారం అబద్దం అని ప్రజలలోకి తీసుకోని వెళ్ళే వారు లేరు. సొంత మీడియా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.
4) చిరంజీవికి రాజకీయాలు అనవసరం. రాజకీయాలకు గౌరవం తీసుకోని వస్తానని, తన సొంత గౌరవాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చింది.
5) రాజకీయం అంటే చంద్రబాబు, కె.సి.ఆర్, జగన్. వాళ్ళ బాటే సరైనది.

రాజకీయం అంటే ఏమి చేసినా తప్పు కాదు. ఇది నా మాట కాదు. ప్రజాతీర్పే దానికి సాక్ష్యం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు. Bookmark the permalink.