డబ్బు సంపాదన – దోపిడి

వ్యాపారం అంటే మోసం అంటారు. అలా అని చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటే ఫుడ్ వుండదు.పోటిలో మోసం చేయక తప్పదు. మోసం లేని వ్యాపారం వుంటుందంటే నేను నమ్మలేను. వ్యాపారస్తులు, ఎవడి రేంజ్ లో వాడు మోసాలు చేస్తూ వుంటారు. దొరకనంత వరకు అందరూ దొరలే.

రాజకీయం అంటే దోపిడీ. అదృష్టమో/దురదృష్టమో జర్నలిజం రాజకీయంలో పెద్ద భాగం. దోపిడీ చేయకుండా రాజకీయలలో నెగ్గుకు రావడం ఆసాధ్యం. ప్రజలు దోపిడీ చేసుకునే అవకాశం ఎవరికీ ఇస్తే వారు దోచుకోవడం సహజం. అందులో ఎటువంటి దాపరికం లేదు. ఎవడి శక్తి, దమ్ము కొలది వాడు దోచుకుంటాడు.

రామోజీ ఫిలిం సీటీ మన రాష్ట్రంలో వున్నందుకు నేనెంతో గర్వపడుతూ వుంటా. ఎందుకు పనికిరాని భూములను అంత అందంగా తీర్చి దిద్దిన రామోజీరావుపై నాకెంతో గౌరవం.

జగన్ అండ్ గ్యాంగ్ విషయంలో అంతే. ఎందుకూ పనికిరాని భూములను వృద్ది చేస్తున్నారు అనే ఫీలింగే నాలో వుంది. కడప అభివృద్ధికి, గుర్తింపుకు వై.యస్ ఫ్యామిలీ అనే విషయం విస్మరించకూడదు.

జగన్ అండ్ గ్యాంగ్ పై రామోజీ ఎటాకింగ్ లో ఆశ్చర్యం ఏమీ లేదు. రామోజీ దోచుకోవడానికి అన్ని దారులు కట్టేసిన వై.యస్ పై ఆ మాత్రం కసి, కక్ష వుంటుందని నిన్న నా డౌట్ సమాధానంగా నా ఫ్రెండ్ అంటున్నాడు.

దోచుకునే అవకాశం అందరికీ రావాలి.

సహజీవనాన్ని చట్టబద్దం చేసినట్లు, రాజకీయ నాయకులు దోచుకోవడాన్ని కూడా చట్టబద్దం చేసేస్తే ఒక పని అయిపోతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.