మంచి మాటలు

మంచి మాటలు చెప్పేవాళ్ళే(90%) పాటించరు. ఇంకా వినేవాళ్ళు, చదివేవాళ్ళు పాటిస్తారు అని నేను అసలు అనుకోను. అలా అని మంచి చెప్పడం అనే ప్రయత్నం మానకూడదు. మంచి మాటలు ఉద్దేశం ఒకరి నుంచి పదిమందికి , ఆ పదిమంది నుంచి మరో వంద మందికి, ఆ వంద మంది నుంచి .. and so on.. చేరి, వాళ్ళ మనసులో పాతుకు పోవాలి. తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నప్పుడు అవి కచ్చితంగా గుర్తు వస్తాయి.

మంచి పాటించక పోయినా మంచికి ఒక గుర్తుంపు కల్పించడం మన బాద్యత. కొందరు మంచి మాటలకు కూడా copy rights అంటూ నాతొ వాదనకు దిగి, నాలో అపరిచితుడిని(నాకు మాత్రమే తెలిసిన అసలైన నేను) బయట పెట్టారు.

చాలెంజ్ సినిమాలో రావుగోపాలరావు డైలాగ్ అంటే నాకెంతో ఇష్టం. ఆ డైలాగ్ “జోకులు వేసే వాళ్ళు అంటే నాకిష్టం. కాని నా మీద జోకులు వేసే వాళ్ళు అంటే పరమ అసహ్యం.” నిజ జీవితంలో నా మీద ఎవరైనా జోకు వేస్తే నవ్వి ఊరుకుంటా. ఎంతో చనువుంటే తప్ప తిరిగి జోకు వెయ్యడానికి ప్రయత్నం చెయ్యను. కాని ఈ virtual ప్రపంచంలో burst కావలసి వచ్చింది.

పాటించినా, పాటించకపోయిన ఇందులో మీకు నచ్చిన మంచి మాటలు మరో పది మందికి చేరవేయండి.

http://nelabaludu.wordpress.com/2010/03/21/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81/

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా. Bookmark the permalink.