తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమాలు

చిరంజీవి రాజకీయ ప్రవేశంతో తెలుగు రాజకీయాలు, తెలుగు సినిమాలు రెండూ merge అయినట్టుగా అనిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో ఒక పాట వుంది. హిందూ లీడర్ , ముస్లిం లీడర్ పబ్లిక్ గా కొట్టుకుంటారు. తెరవెనుక మాత్రం రివర్స్ లో వుంటారు. అప్పుడొక చరణం వస్తుంది. “నమ్మొద్దు .. నమ్మొద్దురో నాయకుడిని .. నట్టేట ముంచేస్తాడు ..” . ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో నిజం అయినట్టుగా వుంది. బొత్సా సత్యనారాయణ ‘మగధీర’ సినిమాను ఆపడంతో పాటు చిరంజీవిని కించపరిచే విధంగా మాట్లాడటం. అభిమానులు బొత్సా సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చెయ్యడం. చిరంజీవిని బొత్సా సత్యనారాయణ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోవడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకే ప్రొడ్యుసర్ అయ్యే స్థాయికి చేరడం. ఏమిటో అంతా భ్రమగా తయారయ్యింది.

రాజకీయలలో ఏమి చేసినా తప్పు కాదంటూ చంద్రబాబును సపోర్ట్ చేసే నేను, చిరంజీవి అభిమానిగా చిరంజీవి కూడా రాజకీయాలు నేర్చుకొని నాయకుడిగా ఎదుగుతున్నాడనుకొని ఆనందపడాలా ?

ఈ విషయంలో మౌనం వహిద్దాం అనుకున్నాను. I can’t.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, రాజకీయాలు, సినిమా, Xclusive. Bookmark the permalink.