ఆటంకాలు

మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం కష్టం. ఇది నా అనుభవం.

 

నిజానికి ఆరోజ్ఞానం వుంది అనుకుంటాం, కాని లేదు. ఏ విషయంలో నైనా ఇలా జరుగుతుందేమో అని మనిషి అనుకోవడం సహజం. అలా జరిగినపుడు మన ఆరోజ్ఞానం పని చేసింది అనుకుంటాం. జరగనపుడు అలా అనుకున్నాం అనే విషయమే మరిచి పోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆరోజ్ఞానం వుంది అనే భ్రమలో వుంటాం. మనిషికి భ్రమ అంటే మక్కువ కాబట్టి, ఆ భ్రమ నుంచి బయటకు రాలేము.

 

ఎదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు అంటే మనం చేసే పనిని ఆపేలా చేసేయో లేదా నువ్వు సాధించలేవు అని నిరుత్సాహ పరిచేవో.

 

అవసరం మనల్ని వెంటాడితే ఏ ఆటంకాలు, మనం చేస్తున్న పనిని ఆపలేవు.

 

నేను చేపట్టిన రెండు ప్రాజెక్ట్స్ నాకు అవసరమా అంటే నా సమాధానం “అంత అవసరం కాదు. ఎక్సట్రా తృప్తి కోసం”. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నాను అనే కంటే, నిరుత్సాహ పడుతున్నాను అనేది నిజం.

 

నేను అభిమానించే ఒక మనిషి ఎప్పుడో ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే “మనం చెప్పదలచుకుంది 28 వర్డ్స్ మించరాదు. అప్పుడే సమర్దవంతంగా చెప్పినట్టు”.

 

“నా గమ్యం, నా లక్ష్యం, నా గమనం ఏమిటి ?” అనే ప్రశ్నలకు సమాధానం 28 వర్డ్స్ మించకుండా:
దేవుడు నాకు ప్రసాదించిన తెలివితేటలు, ఉత్సాహంతో నన్ను నేను నిరూపించుకోవడానికి ఎంటరటైనమెంట్ లేదా సేవలను తోటివారికి పంచడం/అందించడం ద్వారా నేను లాభం పొందాలనే నిరంతర ప్రయత్నంలో మరణం పొందాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.