పైరసీ – కాపీ – స్పూర్తి

నాకు కథలు వ్రాసే సత్తా లేదు. కాని ఉచిత సలహాలు ఇవ్వగల స్టామినా వుంది అనుకుంటూ వుంటాను.

ఏ కథ చూసినా, విన్నా ఆ కథ నుండి కాపీ అనో, ఈ కథ నుండి స్పూర్తి అనో అంటారు. ఎవరో కాదు, నేను కూడా ఆ మాటే అంటూ వుంటాను. ఆ వ్యాఖ్యలలో నిజం వుంది. ఎందుకంటే కాపి కొట్టడమో, స్పూర్తి పొందడమో నిజం కాబట్టి.

ఒరిజినల్ కథ అంటే ఏమిటి ?” అనే ప్రశ్నకు సమాధానం “కథ మన జీవితానుభవం నుంచి పుట్టాలి, కాని వేరే సినిమా నుంచి కాదు” అని వస్తుంది.

ఇక్కడ నా కన్‌ఫ్యూజన్ ఏమిటంటే, “ప్రపంచం ఇప్పుడే మొదలు కాలేదు.. ఎప్పుడో మొదలైంది ..” . మనం అనుభవించే మన అనుభవాలు, మన ముందు తరాల వారు ఎప్పుడో అనుభవించేసారు. కథ మన అనుభవం నుంచే పుట్టనవసరం లేదు. మన ముందు తరాల వారి నుంచి కూడా పుట్టవచ్చు. SO మనలో పుట్టిన ఆలోచనే ఒక సినిమాగా వచ్చినపుడు, ఒక సినిమాను కాపీ కొట్టడం, స్పూర్తి పొందడంలో అసలు తప్పు లేదు. ఒరిజినల్ దగ్గర నుండి “అనుమతి తీసుకోవాలా వద్దా ? అనేది మాత్రం ఆలోచించాలి.” MOST OF THE CASES NOT REQUIRED BECAUSE CREATORS NEVER CARE ABOUT COPY. THEY FEEL PROUD.

ఈ కాపి/స్పూర్తిని నిర్మాతలు పోరాడుతున్న పైరసీతో ముడి పెట్టలేము. పైరసీ అనేది పూర్తిగా వ్యాపారానికి సంబందించింది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కన్‌ఫ్యూజన్, సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.