కాపి: స్పూర్తి – నా అభిప్రాయం

నాతో ఒకరు ఏకీభవించినా, లేక పోయినా నా అభిప్రాయం మాత్రం మారదు.

నా దృష్టిలో ఒకరి ఆలోచనలను దొంగిలించడం తప్పు. అంతే కాని రిలీజ్ అయిన ఒక సినిమాలోని సీన్స్ కాపి కొట్టడం, స్పూర్తి పొందడం తప్పు కాదు. అనుమతి తీసుకోవాలని ఒరిజినల్ క్రియేటర్ ఆశిస్తే, వారి అనుమతి తీసుకొని వారి పేరు మెన్షన్ చేస్తే సభ్యత అనిపించుకుంటుంది. ఈ విషయంలో నాకు పెద్ద గొడవలే జరిగినాయి.

కొందరు మేధావులు ఈ కాపి, స్పూర్తిని మన తెలుగు సినిమా నిర్మాతలు పోరాడుతున్న పైరసీతో ముడిపెడుతున్నారు. దానిని నేను ఇక్కడ ఖండించడం జరిగింది.

నా జీవితానుభవం, నా పరిధి చాలా చిన్నది. నేను క్రియేట్ చేసేది అంతా కాపినే అని నా ఫీలింగ్. ఎందుకంటే నా ఆలోచనలు ఎక్కడో విన్నా లేదా చదివిన లేదా చూసినవే. అవి సినిమాలలోనే కావడం అని ఇక్కడ నొక్కి చెప్పుకోవాలి.

I MEAN “మా కథలో ఒక సీన్ ఆ సినిమాలో చెప్పినట్టుగా చెపితే ఎలా వుంటుంది” అనే ఆలోచనతోటే మొదలు అవుతాది. “ఈ సీన్ కు ఇక్కడ చదివిన డైలాగ్ బాగా ఆప్ట్ అవుతాది” అనిపించవచ్చు మరియు వాడుకొవచ్చు.. ఇలా చేయడం నా దృష్టిలో తప్పు కాదు.

ఇద్దరు కలిసి పని చేస్తున్నపుడో, సిక్రెట్ గా దాచుకున్న ఒకరి ఆలోచనలను దొంగిలించడం నా దృష్టిలో తప్పు తప్ప, పబ్లిక్ అందరికీ అందుబాటులో వున్న కంటెంట్ కథల్లో వాడుకోవడం తప్పు కాదు.

ఒకరికి నష్టం కలిగించనిది, ఒకరిని మోసం చేయనది ఏదీ తప్పు కాదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.